పీసీబీ అధికారుల కుమ్మక్కు!
పీసీబీ అధికారుల కుమ్మక్కు!
హైద్రాబాద్: ఎల్ బి నగర్ లో వాసవి ఆనంద నిలియం డెవలపర్ల తో పీసీబీ రంగారెడ్డి రీజనల్ అధికారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డెవలపర్లు 4000 పైగా అపార్టుమెంట్లు నిర్మాణానికి ghmc లో పర్మిషన్ తీసుకొని అంత కంటే తక్కువ విస్తీర్ణమునకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కుమ్మక్కై ec మరియు cfe పొందారు. అంతే కాకుండా నిభందనలు నీళ్ళు వదిలి rmc కొరకు cfo అనుమతులు తీసుకొకుండా పీసీబీ అధికారులతో లాలూచీ పడి పర్యావరణ నిభందనలను తుంగలో తొక్కారు. ఈ విషయం పై ఫిర్యాదులు వచ్చిన పీసీబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జోనల్ మరియు రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విషయం పై వెంటనే స్పందించి మానిటర్ చేయడం లో విఫలమైన అధికారుల పై చర్యలు తీసుకొని ఆర్ఎంసి కి క్లోజర్ ఆర్డర్ ఇచ్చి, ఈసి మరియు సిఎఫ్ఈ లను రద్దు పరచి డెవలపర్లు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారుడు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Post a Comment