కొత్త వారికి అవకాశం ఇవ్వాలి! - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు దివ్వెల
కొత్త వారికి అవకాశం ఇవ్వాలి! - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు దివ్వెల,
వరంగల్:
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు దివ్వెల అభిప్రాయపడ్డారు. బైలా ప్రకారం ఎన్నికలు జరపకుండా గత 10 సంవత్సరముల నుండి ఒక్కరే అధ్యక్షుడుగా కొనసాగడం అప్రజాస్వామికం అని తెలిపారు. తక్షణమే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మహాసభ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపి ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు తొలగి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు పేద ఆర్యవైశ్యులకు సహకారం అందించి ప్రభుత్వం నుండి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతీ పేద ఆర్యవైశ్య కుటుంబానికి అందేలా చూడాలని ఆయన కోరారు.
Comments
Post a Comment