మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.


 *మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.* 

Hyderabad 

నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో నిన్న మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిల పై దాడి చేసి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. రుణమాఫీ పై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరాము. ఈ అంశంపై స్పందించిన డిజిపి జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

డిజిపిని కలిసిన వారిలో  టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్