విశ్వకర్మ యజ్ఞోత్సవం లో పాల్గొన్న ఉప్పల
హైద్రాబాద్, గూఢచారి:
విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీ ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మయజ్ఞం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సకల చరాచర శక్తికి మూలకారుడు, సకల వృత్తుల వారికి పూజ్యనీయుడైన శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలందరికీ "విశ్వకర్మ జయంతి" శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కుల సంఘాలకు అన్ని విధాలా కృషి చేస్తున్నాడు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు అండగా వుంటుంది అని ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. అనంతరం ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సాయి కిరణ్ ,కార్యనిర్వాహక అధ్యక్షులు.కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు సల్వా చారి, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు పర్వతం శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి ఆందోజు శ్రీనివాస చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవన్, యజ్ఞ కమిటీ అధ్యక్షులు నరేష్, కొండల చారి సింహాద్రి చారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment