నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశం
నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశం
హైద్రాబాద్, గూఢచారి:
నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని కట్టడంపై అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై న్యాయస్థానానికి వెళ్లిన కారు పార్టీకి ఊహించని షాకు తగిలింది.
హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. 2018లో హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లే దారిలో అగ్రోస్ రెండెకరాల స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. 99 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు తీసుకుంది. ఏడాదికి గజానికి వంద రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీఆర్ఎస్ ఆఫీసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ఆఫీసును కట్టారని, దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించి 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Comments
Post a Comment