*ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
*ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
* నల్గొండ జిల్లాలోని ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టుకు నెలవారిగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
* గత పదేండ్లుగా నల్లగొండ జిల్లా రైతులు సాగునీళ్లు లేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటామన్న మంత్రి.
* రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
* ఎస్ ఎల్ బి సి హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మరమత్తులో ఉన్న 4 వ పంపును మూడు రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .
* ఉదయసముద్రం ,బ్రాహ్మణ వెల్లెముల కింద భూసేకరణకు సంబంధించి 37 కోట్ల రూపాయలు విడుదల చేస్తే రెండు నెలల్లో చెరువులన్నింటిని నింపుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , దీని ద్వారా కట్టంగూరు, నార్కెట్ పల్లి మండలాల్లో సుమారు 70000 ఎకరాలు చెరువుల ద్వారా పండుతాయని ఆయన తెలిపారు.
* ఎస్ఎల్ బిసీ మాత్రమే శాశ్వత పరిష్కారంగా భావించి 2004లో మేనిఫెస్టోలో చేర్పించడం జరిగింది, శ్రీశైలం నీరు డెడ్ స్టోరేజ్ కి వెళ్లినప్పటికీ ఎస్ ఎల్ బి సి ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు.
* ఎస్ఎల్బీసీని త్వరితగతిన పూర్తి చేసేందుకు నేలకు 30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి ని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
* పదేండ్లుగా వివక్షకు గురైన నల్గొండ జిల్లా ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసేందుకు నిధులు విడుదలకు విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Comments
Post a Comment