పొట్టి శ్రీరాములు విశ్వావిద్యాలయం పేరు మార్పు విరమించుకోవాలి - ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త
పొట్టి శ్రీరాములు విశ్వావిద్యాలయం పేరు మార్పు విరమించుకోవాలి - ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైద్రాబాద్:
క్యాబినెట్ సమావేశం లో తీసుకున్న పొట్టి శ్రీరాములు విశ్వావిద్యాలయం పేరు మార్చి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టడం పై ప్రభుత్వo తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలని ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. పేరు మార్పు తో వైశ్యుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. సురవరం ప్రతాపరెడ్డి మహనీయుడు అయన పేరు ఇతర సంస్థలకు పెట్టీ ఆయనను కూడా గౌరవించాలని అయన కోరారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు.
Comments
Post a Comment