నల్లగొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం… ఎంపీడీవో సస్పెన్షన్, కార్యదర్శి భర్తరఫ్


నల్లగొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం… ఎంపీడీవో సస్పెన్షన్, కార్యదర్శి భర్తరఫ్


–గ్రామపంచాయతీలకు గడ్డి కోత యంత్రాలను కొనుగోలులో నిర్లక్యం

–మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, కంపోస్ట్ షెడ్ నిర్వహణ పట్ల నిర్ల క్ష్యం పర్యవసానం

–గుర్రంపోడు ఎంపీడీవో పి. మం జుల సస్పెన్షన్

–పెద్దవూర మండలం, పులిచెర్ల గ్రామపంచాయతీ కార్యదర్శి కే. నాగరాజు ఉద్యోగం నుండి తొల గింపు

–దామరచర్ల మండలం,వాచ్య తాండ జూనియర్ గ్రామపంచా యతీ కార్యదర్శి కె.స్వప్నను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నల్గొండ,(గూఢచారి): పారిశుధ్య కార్యక్రమాలలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు (grama panchayats) గడ్డి కోత యం త్రాలను కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ 37 గ్రామపం చా యతీలకు గాను కేవలం 10 గ్రామపంచాయతీలకు మాత్రమే గడ్డి కోత యంత్రాలను( Grass cutting machines) కొనుగోలు చేసి 27 గ్రామపంచాయతీలకు కొను గోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, అలాగే మొక్కల పెంపకం, కంపోస్ట్ షెడ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి కారణాలవల్ల నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండల ఎంపీడీవో ( mpdo) మంజు లను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ( collector Narayana Reddy) సస్పెండ్ చేశారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మం డల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా గుర్రంపో డు మండలంలో పారిశుధ్య కార్యక్రమాలపై సమీక్ష సందర్బంగా నిర్లక్ష్యం పై గుర్రంపోడు ఎంపీడీవోను సస్పెండ్ (Gurrampodu MPDO suspended) చేశారు. గడ్డి కొత్త యంత్రాల కొనుగోలు చేయకపోవడం, మొక్కల పెంపకం, పారిశుధ్య కార్యక్రమాలు, కంపోస్ట్ షెడ్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించి నందు కుగాను గుర్రంపోడు ఎంపీడీవోను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే పెద్దవూర మండలం, పులిచర్ల గ్రామ ఔట్సోర్సింగ్ గ్రామపం చాయతీ కార్యదర్శి (secretary) కే. నాగరాజు మంగళవారం అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, మండల ప్రత్యేక అధి కారి గ్రామ సందర్శనలో అందుబాటులో లేకపోవడం, గ్రామంలో పారి శుధ్యం, చెత్త సేకరణ, ప్లాంటేషన్ తదితర విషయాలపట్ల నిర్ల క్ష్యం కారణంగా ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు.

అంతేకాక దామరచర్ల మండలం, వాచ్య తాండ జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.స్వప్న పారిశుద్యం , మొక్కల పెంపకం తదితర వాటిపట్ల నిర్లక్ష్యం కారణంగా విధుల నుండి సస్పెండ్ చేస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పారిశుధ్య నిర్వ హణ, సీజనల్ వ్యాధులు ,మొక్కల పెంపకం, తదితర అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెప్పడం తో పాటు, రాతపూర్వకంగా ఉత్త ర్వులు( orders) జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించడం జరిగిం దని ,విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


పారిశుధ్య లోపం కారణంగా సీజనల్ వ్యాధులు( Seasonal dise ases) ప్రభలెందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్య, మలేరియా వంటి జ్వరాలు సోకేందుకు ఆస్కారం ఉందని, దోమల వల్ల ఈ వ్యాధులన్నీ వస్తాయని, దోమలు పెరగ కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.


ప్రత్యేకించి దోమల నివారణకు పాగింగ్ (foging) తో పాటు, గ్రా మాలలో ముళ్లఫో దలు పిచ్చి మొక్కలు తొలగించేందుకు తప్పని సరి గా ప్రతి గ్రామపం చాయతీకి గడ్డి కోత యంత్రాలను కొను గోలు చేయాలని, నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ (oil bolls) ను వేయాలని, మురికి కాలువలను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయాలని ఆయన మరోసారి తెలిపారు.


మండల ప్రత్యేక అధికారులు గ్రామాలు సందర్శించినప్పుడు తప్పని సరిగా గ్రామంలో శానిటేషన్ తో పాటు ,అంగన్వాడి ,పాఠశాలలు అన్నింటిని పరిశీలించాలని, వనమహోత్సవం (Vanamahots avam) కింద పెంచిన మొక్క లు వీటన్నిటిని తనిఖీచేయాలని అన్నారు. స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ , మండలాల ప్రత్యేక అధికా రులు, జిల్లా అధికారులు, అధికా రులు ,ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్