*ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు వినూత్నంగా గులాబీ పూల పంపిణీ*



*ఆటో డ్రైవర్ లంతా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి*


*నిర్లక్ష్యంగా ఆటోలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు*


*ఆటో డ్రైవర్లతో నూతన ట్రాఫిక్ సిఐ రాజు అవగాహన సమావేశం*


*ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు వినూత్నంగా గులాబీ పూల పంపిణీ*




**************************************************

*నల్లగొండ*: *ఆటో డ్రైవర్లంతా ఆటోలు నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నూతన ట్రాఫిక్ సిఐ డి.రాజు అన్నారు* శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ సిఐ రాజు ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వినూత్నంగా ఆటో డ్రైవర్లకు గులాబీ పూలను అందజేశారు. 

ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. 

అదేవిధంగా తప్పకుండా లైసెన్సులు, ఇన్సూరెన్స్ తీసుకోవాలని, డ్రెస్ కోడ్ పాటించాలని అన్నారు. తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని తెలిపారు. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడేలా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవద్దని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్ ను ప్రయాణికులకు కనిపించే విధంగా కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

లైసెన్సులు, ఆర్సి, ఇన్సూరెన్స్ లేని వారంతా వారం రోజులలోగా తీసుకోవాలని తెలిపారు. లేనియెడల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే డ్రైవర్ల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఆటో డ్రైవర్ ప్రయాణికుల శ్రేయస్సు, తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆటోను నడిపి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు.

సమావేశంలో పాల్గొన్న ఓ ఆటో డ్రైవర్ ఆటోకు సంబంధించి అన్ని పేపర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ కలిగి ఉండడంతో అతనికి నగదు బహుమతిని అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్