ఓపీఎస్ అమలు కోరుతూ 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్'
బీమా భవన్లో లో నిరసన తెలుపుతున్న స్థితప్రజ్ఞ, ఉద్యోగులు |
ఓపీఎస్ అమలు కోరుతూ 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్'
• ఎన్ఎం ఓపీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
హైదరాబాద్, (గూఢచారి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని(యూపీఎస్) వ్యతిరే కిస్తూ నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎం ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్' పేరిట గురువారం ప్రభుత్వ ఉద్యో గులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి.. విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బొగ్గులకుంటలోని బీమా భవ న్లో ఎన్ఎం ఓపీఎస్ సెక్రటరీ జనరల్ గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ సామాజిక భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వమే.. పెన్షన్ కొను క్కునేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసన కార్యక్రమాల్లో సీపీఎస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు
Comments
Post a Comment