ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం లోపు పూర్తి -సిపి,సీవీ ఆనంద్*
*ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం లోపు పూర్తి -సిపి,సీవీ ఆనంద్*
హైదరాబాద్ : సెప్టెంబర్ 15
వినాయక చవితి నవరాత్రు లు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 17 వ తేదీ మంగళ వారం నాడు గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది.
ఈ నేపథ్యంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిష నరేట్ల పరిధిలో 25 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఈనెల 17 మధ్యాహ్నం 1.30 గంటలోపు పూర్తి చేయను న్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు..
ఉదయం 6.30 గంటల వర కు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్లను న్నట్లు తెలిపారు. పోలీసు లు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయం తో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామ న్నారు...
Comments
Post a Comment