ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు పోటెత్తుతున్న జర్నలిస్టులు


 ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు పోటెత్తుతున్న జర్నలిస్టులు 


- మూడోరోజు ఉత్సాహంగా సాగిన సభ్యత్వాలు 


- సభ్యత్వాలు స్వీకరించిన సీనియర్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ఎడిటర్లు








నల్గొండ, (గూఢచారి): 25-09-2024

నల్లగొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులతో పాటు చిన్న పత్రికల ఎడిటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. సభ్యత్వాల సేకరణ మూడవ రోజు బుధవారం పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు చిన్న పత్రికల ఎడిటర్లు సభ్యత్వాలను స్వీకరించారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ లు జర్నలిస్టులకు సభ్యత్వలను అందజేసి మాట్లాడారు.


చిన్న పత్రిక ఎడిటర్లు 30 మంది ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. చిన్న పత్రిక ఎడిటర్లు ప్రెస్ క్లబ్ లో చేరడం ప్రెస్ క్లబ్ కు ఎంతో బలం చేకూర్చినట్లుగా భావిస్తున్నామన్నారు. యూనియన్లకు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అందరూ కలిసి రావాలని కోరారు. సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ప్రారంభించుకున్నామని బుధవారం నాటికి మూడవరోజు కొనసాగుతుందని నేటికీ 130 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారన్నారు. చిన్న పత్రిక ఎడిటర్లు సంపాదకులు ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడానికి స్వాగతిస్తున్నామన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ నడవలేదని, ప్రెస్ క్లబ్ ను పున ప్రారంభించుకొని కొనసాగుతున్నామన్నారు. చిన్న పత్రిక ఎడిటర్ల గౌరవానికి ఎక్కడ బంగం కలగకుండా నడుచుకుంటామని అదే స్థాయిలో ప్రెస్ క్లబ్ యూనియన్ కు కూడా సంపూర్ణమైన మద్దతు భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో కొనసాగించాలని కోరారు. చిన్న పత్రికల సభ్యత్వం తీసుకున్న వారిలో ఎన్నమల్ల రమేష్ బాబు, మక్సుద్, భూపతి రాజు, షరీఫ్ బాబు, బి. లక్ష్మినారాయణ, నారాయణ, టి. శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, మోయిజ్, కారింగుల యాదగిరి, శ్రీనివాస్, వీరెల్లి సతీష్ తో పాటు పలువురు జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సభ్యత్యం తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్