కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్


 కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ 

నల్గొండ. 12. 9. 2024


       కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కోరారు.


        గురువారం అయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) పై రైస్ మిల్లర్లు ,పౌరసరఫరాలు, ఎఫ్ సి ఐ అధికారులతో సమీక్షించారు.


      2023 -24 ఖరీఫ్ ,రబికి సంబంధించిన సీఎంఆర్ ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని, అయితే గడువు చేరుకునేందుకు 18 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ వారం, వచ్చేవారం సెలవులు ఉన్నందున సెలవు రోజుల్లో సైతం మిల్లర్లు, సిబ్బంది పనిచేసి సిఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ముఖ్యంగా 2023 ఖరీఫ్ సి ఎం ఆర్ ఏ ఒక్క రేక్ పెండింగ్ లో లేకుండా ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని, రబి సీఎంఆర్ ను 30వ తేదీలోగా చెల్లించాలని కోరారు .ఇందుకు పౌరసరఫరాల అధికారులు ,సిబ్బంది, మిల్లర్లు సమన్వయం చేసుకొని సీఎంఆర్ చెల్లింపును పూర్తిచేశాలా చూడాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సి ఎం ఆర్ సాధనలో నిరంతరం రైస్ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు .


       డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,ఎఫ్ సి ఐ మేనేజర్ రఘుపతి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతు, కార్యదర్శులు, రైస్ మిల్లర్లు ,ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు.

____________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్