FCI - _స్వచ్చత ర్యాలీ_
భారత ఆహార సంస్థ, నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరుపబడుతున్న
*స్వచ్చత యే సేవ* కార్యక్రమంలో భాగంగా, సంస్థ ఉద్యోగులు ఈ రోజు _స్వచ్చత ర్యాలీ_ నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ AGM (QC) డా. రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల స్వప్నమైన వికసిత భారత సాధనకు స్వచ్ఛ భారతమే ముఖ్య సోపానమని అభిప్రాయపడ్డారు. రామగిరి లోని సంస్థ జిల్లా కార్యాలయం నుండి ఉద్యోగులు క్లాక్ టవర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలాపన చేశారు.
కార్యక్రమంలో, సీనియర్ అధికారులు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, బిల్ల శ్రీనివాసరావు, కె కె షా, జయ కుమార్, పట్నాయక్, సుకుమార్ మరియు సెక్షన్ ఉద్యోగులు సతీష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment