ఓపీఎస్ అమలుపై PCC అధ్యక్షునికి సీపీఎస్ ఉద్యోగుల వినతి
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడును శాలవాతో సత్కరించి వినతి పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల నాయకులు జి. స్థితప్రజ్ఞ , కల్వల్ శ్రీకాంత్ తదితరులు |
ఓపీఎస్ అమలుపై PCC అధ్యక్షునికి సీపీఎస్ ఉద్యోగుల వినతి
హైదరాబాద్, (గూఢచారి): పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించాలని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్‌కుమార్ గౌడ్‌కు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మంగళవారం మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్మిని కలిసినప్పుడు తమ డిమాండ్లను గూర్చివివరించాలని కోరారు. అనంతరం రాష్ర్యలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో
సీపీఎస్ ఉద్యోగుల మద్దతును గుర్తుచేశారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్నిరద్దుచేయడం వల్ల ప్రభుత్వానికి సమకూరే ఆదాయాన్ని గూర్చి వివరించారు.ఈ సందర్భంగా వారు టీపీసీసీ చీఫ్‌ను శాలువతో సన్మానం చేశారు. టీపీసీసీ చీఫ్‌ను కలిసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ ఇతర నేతలుగడ్డం వెంకటేష్, బాలస్వామి, చంద్రకాంత్, కృష్ణారావు, భూమన్న, లక్ష్మీనరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment