RTI ప్రధాన కమీషనర్ మరియు కమీషనర్ల ను నియమించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
లేఖ యధాతధంగా చదవండి.
గౌ// ముఖ్యమంత్రి గారిని కోరుతుంది.
హైదరాబాదు
L. No. FGG/CM/REP/ /2024 28-9-2024
గౌ// ముఖ్యమంత్రి గారు
తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదు
అయ్యా !
సమాచారహక్కు చట్టం సెక్షన్ 15 (1) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సమాచార కమీషనర్ మరియు కమీషనర్ల నియామకం జరపాలి. ప్రభుత్వ యంత్రాంగం సమాచారం ఇవ్వని పక్షంలో కమీషన్ వారు తమ వద్దకు వచ్చిన అప్పీళ్ళను విచారించి కోరిన సమాచారం ఇప్పిస్తుంది.
ప్రధాన సమాచార కమీషనర్ మరియు కమీషనర్లు ప్రజా జీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. వారికి విశాలమైన విషయపరిజ్క్షానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవముండాలని సెక్షన్ 15 (5) నిర్థేశిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కమీషనర్ గారు తేది 24-8-2020 న పదవీ విరమణ చేయగా మిగిలిన ఐదుగురు కమీషనర్లు తేది 24-2-2023 నాడు పదవీ విరమణ చేయడంతో గత 18 నెలల నుంచి కమీషన్ పనిచేయడం లేదు.
సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన కమీషనర్ మరియు కమీషనర్ల నియామకం చేయాలని మా సంస్థ హైకోర్టులో పిల్ వేడం జరిగింది (పిల్ నం. 18/2023) . తేది 5-7-2023 నాడు అడ్వకేట్ జనరల్ గారు అఫిడవిట్ దాఖలు చేస్తూ ప్రధాన కమీషనర్, కమీషనర్ల నియామకం గురించి దరఖాస్తులు కోరినామని తొందరలోనే నియామకం జరుగుతుందని హైకోర్టుకు తెలుపడం జరిగింది. కాని ఇంతవరకు ఏమీ చర్యలు తీసుకోలేదు.
కమీషనర్లు లేకపోవడంతో సుమారు 15 వేల అప్పీళ్ళు కమీషన్ కార్యాలయంలో పెండింగులో ఉన్నాయి. అదీకాక కమీషనర్లు లేనందున ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు సమాచారము కొరకు వచ్చిన దరఖాస్తులను పెద్దగా పట్టించుకోడం లేదు.
సమాచారహక్కు చట్టం నిర్థేశించిన విధంగా సమాజంలో మంచి పేరున్న నిష్ణాతులను, అనుభవజ్క్షులను ప్రధాన కమీషనర్ మరియు కమీషనర్లుగా తొందరలోనే నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌ// ముఖ్యమంత్రి గారిని కోరుతుంది.
భవదీయుడు
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Post a Comment