TGPCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం
TGPCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం
హైద్రాబాద్, (గూఢచారి):
తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2024ని సెప్టెంబర్ 19, 2024న రైన్బో స్కూల్, సనత్నగర్, హైదరాబాద్లో జరిపారు. TGPCB ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వర రావు “వాతావరణ చర్యల పురోగతి” పై కీ నోట్ ప్రసంగాన్ని ఇవ్వడంతో పాటు ఓజోన్ రక్షణపై విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం శ్రీమతి జులేఖా స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. మొహమ్మద్ సయీద్ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్రపై ప్రసంగించి, విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు.విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు మరియు క్విజ్ పోటీలు కూడా నిర్వహించబడ్డాయి, విద్యార్థులకు ఓజోన్ పొర క్షీణత, వాతావరణ మార్పులు, మరియు సుస్థిరతతో సంబంధిత అంశాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రైన్బో స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1987లో సంతకం చేయబడిన మాంట్రియల్ ప్రోటోకాల్ను స్మరించుకున్నారు. కార్యక్రమం చివరలో విద్యార్థుల సందేహాలను క్లారిఫై చేసి, రన్నర్ మరియు విజేతలకు ధ్రువపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కృతజ్ఞత పూర్వకంగా ముగిసింది.
Comments
Post a Comment