48 గంటల్లోగా లాఠీఛార్జికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి : VHP


 48 గంటల్లోగా లాఠీఛార్జికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి : VHP 



 

@ అక్రమ లాఠీచార్జిని నిరసిస్తూ రేపు గవర్నర్ ని కలవనున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం


@ ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి నోరు విప్పాలనీ డిమాండ్


@ డిజిపి, దేవాదాయ శాఖ మంత్రిని కలవనున్న VHP



@ రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక


@ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన VHP


@ VHP బజరంగ్ దళ్ కార్యకర్తలపై అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్.


@ పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తల పరిస్థితి విషమం గా ఉందని ఆవేదన




సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ మందిరం దగ్గర అమానుషంగా లాఠీచార్జికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. శనివారం శాంతియుతంగా నిరసన నిర్వహిస్తున్న హిందూ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలపై అకారణంగా లాఠీచార్జ్ చేసిన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. ఆదివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. అత్యంత కర్కశంగా భజరంగ్ దళ్ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. రేపు (21వ తేదీ, సోమవారం రోజు) రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. పోలీసులు వ్యవహరించిన అప్రజాస్వామిక చర్యలను గవర్నర్ కు వివరిస్తామని చెప్పారు.


వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు శాఖలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. 


కనీసం దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. దేవుడి హుండీ, దేవుడి ఆదాయం, దేవుడి మాన్యాల పైనే దృష్టిపెట్టిన ప్రభుత్వం.. హిందువుల మనోభావాల విషయంలో కూడా ఆలోచించాలని ఎద్దేవా చేశారు. 


పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్న డీజీపీ గారు చొరవ తీసుకొని లాటి చార్జ్ కు పాల్పడ్డ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విశ్వహిందూ పరిషత్ 48 గంటల సమయం ఇస్తుందని... ఈలోపు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. 48 గంటల్లో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ అల్టిమేటం జారీ చేస్తుందన్నారు.


కవ్వింపు చర్యలకు పాల్పడిన పోలీసులు.. హిందూ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీ చార్జీలో గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పోలీసులు బలవంతంగా డిశ్చార్జ్ చేయించారని, ఇది అత్యంత పాశివిక చర్య అని మండిపడ్డారు. గాయపడ్డ కార్యకర్తలను ఇళ్లకు తరిమివేస్తే, తమ వాళ్ళు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారని చెప్పారు.


అయితే, వాస్తవానికి రేపు (సోమవారం రోజే) రాష్ట్ర బంద్ పిలుపునకు విశ్వహిందూ పరిషత్ సిద్ధపడిందని.. కానీ రేపు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్నందువల్ల తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు బాలస్వామి చెప్పారు. తమ నిరసన వల్ల ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇబ్బంది పడవద్దని, పరీక్ష రాస్తున్న విద్యార్థులు తమ జీవిత గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోనే తమ బంద్ ను వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో 48 గంటల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సునీత రామ్మోహన్ రెడ్డి గారు, 

రాష్ట్ర సహకార్యదర్శి శ్రీ భాను ప్రసాద్ గారు, ధర్మ ప్రసార్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్ చందర్ పాల్గొని మాట్లాడారు.




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్