*భారత ఆహార సంస్థ లో స్వచ్చత కై ప్రత్యేక ప్రచార ఉద్యమం - 4.O*
*భారత ఆహార సంస్థ లో స్వచ్చత కై ప్రత్యేక ప్రచార ఉద్యమం - 4.O*
నల్గొండ, (గూఢచారి): ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవస్థాపరంగా ‘స్వచ్ఛత’ను పాటించే కార్యక్రమంతో పాటు చాలా కాలంగా పెండింగు పడ్డ వ్యవహారాలను కనీస స్థాయికి పరిమితం చేయడానికి భారత ఆహార సంస్థ, ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు సంస్థ నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో
‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ అక్టోబర్ 31 వ తేదీ వరకు నిర్వహించబడుతుందని సంస్థ నల్గొండ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0 ను రెండు దశల్లో ఆచరిస్తున్నారనీ, మొదటి దశ సన్నాహక దశ ను సెప్టెంబర్ 16 నుండి ప్రారంభించి అదే నెల 30న ముగించామనీ, రెండో దశ అయిన అమలు దశను మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ప్రారంభించి ఈ నెల 31వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాక, ఈ కార్యక్రమంలో ముఖ్య అంశాలైన ఫైళ్ళ వర్గీకరణ, ఏరివేత, చరిత్రాత్మక రికార్డుల సంరక్షణ వంటి విషయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంస్థాగత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Post a Comment