నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ ని ఘనంగా సన్మానించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ ని ఘనంగా సన్మానించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
నల్గొండ, (గూఢచారి): నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్స్ ని ఘనంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది జి జి యల్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్ల నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల సంక్షేమంకై నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీమా ఆటోగ్రాఫి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల ఏర్పాటు చేయటం మా బహుజన జాతి బిడ్డలందరికీ గొప్ప అవకాశం అని ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలలో పోలీస్ విభాగాలలో పనిచేస్తుండడం జరిగింది అంటే అది మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంగా వారి సహాయం వల్లనే లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య చదువుకోవడం జరుగుతుంది ప్రైవేట్ కాలేజీలో లక్షల రూపాయలు పెట్టలేని వారు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన క్వాలిఫైడ్ లెక్చరర్స్ బోధనలు విని మంచి స్థాయికి రావడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కళాశాల చైర్మన్ గోన రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తున్నారు ఇప్పటికీ కావున వారికి కూడా మా బహుజన విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు చెబుతూ నూతనంగా సంగం బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ హేమ్లా నాయక్ గారికి సెక్రెటరీ శిల్ప వైస్ ప్రెసిడెంట్ జ్యోష్ణా ట్రెజరర్ ధనమ్మ చీఫ్ అడ్వైజర్ శిబ జాయింట్ సెక్రెటరీ రామకృష్ణ లేడీస్ సెక్రటరీ గా నస్రత్ బేగం ఈసీ మెంబర్స్ కోటేశ్వరరావు లింగారెడ్డి వేణుగోపాల్ లను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ తాడిశెట్టి నరసింహ, లెక్చరర్స్ శివకోటి, విక్రమ్ బాబు, మల్లెపాక వెంకన్న, జిల్లా నరసింహ జయమ్మ లింగం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరు జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నియోజకవర్గ అధ్యక్షులు శివతేజ ప్రవీణ్ సురేందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment