రూ.కోట్లు కాజేసిన దంపతుల అరెస్టు


 రూ.కోట్లు కాజేసిన దంపతుల అరెస్టు 

-వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తామని మోసం

-సిసిఎస్ పాటు పలు స్టేషన్ కేసులు

హైదరాబాద్: తన పరిశ్రమలో పెట్టుబడి పెడితే పాట్ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్ల రూపాయలు దండుకుని మోసగించిన దంపతులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టున దంపతులపై బోయిన్ తిరుమలగిరి, మహాంకాళి పోలీసు స్టేషన్ కూడా చీటింగ్ కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కడపల్లికి చెందిన హెచ్.దినేష్ (50), జ్యోతి (47) దంపతులు. వీరికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ శ్రీరామా ఇంటర్ పేరుతో హోల్ కిరాణాషాప్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కీసరలో అభినవ్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ తయారీ పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నారు. 

తమ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెడితే మంచి కమీషన్ పాటు పార్టర్ కూడా ఇస్తామని నమ్మించి పలువరి నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ చెందిన వ్యాపారి పి.లక్ష్మణ్ (55)కు ఈ దంపతులు నమ్మించడంతో రూ.1.10 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రెపోమాపో పాట్ ఇస్తానని దంపతులు నమ్మిస్తూ వచ్చారు. ఇలా ఆరు నెలలు గడిచినా పాట్ ఇవ్వకుండా మోసగించారు. తాను పెట్టిన పెట్టుబడి డబ్బులు వెనక్కి ఇచ్చివేయాలని లక్ష్మణ్ నిలదీశాడు.దీంతో దంపతులు నెల రోజుల క్రితం రూ.1.10 కోట్లకు చెక్ ఇచ్చారు. ఆ చెక్ బ్యాంక్ చెల్లకపోవడంతో బాధితుడు లక్ష్మణ్ సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ ఎస్ యుగేందర్ నిందితులైన జ్యోతి, దినేష్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్