అంతర్జాతీయ వాతావరణ చర్య దినోత్సవం
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024
ప్రభుత్వ డిగ్రీ కళాశాల చంచలగూడ, అంతర్జాతీయ వాతావరణ చర్య దినోత్సవాన్ని( International Day of Climate Action -2024 ఈరోజు జరుపుకుంది
చంచలగూడలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు అంటే 24-10-2024న క్లైమేట్ యాక్షన్ అనే అంశంపై కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి శ్రీనివాసులు అధ్యక్షతన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) సహకారంతో విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాల సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాతావరణ చర్యల తక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు ప్రసంగిస్తూ, వాతావరణ మార్పులను తగ్గించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఉద్ఘాటించారు.
ఇంధన రంగం ద్వారా కలిగే కార్బన్ ఉద్గారాల వలన వాతావరణంలో పెను మార్పులు సంబవిస్తున్నాయి అని చెప్పారు. "మన కార్బన్ పాదముద్రను ( carbon foot print )తగ్గించడం మరియు సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం చాలా అవసరం.
ఎక్కువ చెట్లను నాటడం మరియు వ్యర్థాలను తగ్గించడం ద్వారా వ్యక్తిగతంగా మరియు సంస్థాగతంగా మనం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించి తద్వారా భూమి యొక్క వాతావరణంలో వేడిని నియంత్రించాలి.
అనంతరం నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో 27 మంది కళాశాల విద్యార్థుల ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కళాశాలఅధ్యాపకులు పి ఆంజనేయులు, శ్రీ రాంగోపాల్ రెడ్డి, డాక్టర్ శ్రీ టి శ్రీలక్ష్మి & డాక్టర్ నాగరాజులు పాల్గొన్నారు
Comments
Post a Comment