జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్ - మరో ముగ్గురి మాటేమిటి?


 జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్ 

మరో ముగ్గురి మాటేమిటి?


నిందితులందరినీ అరెస్టు చేయాలి


‌సుదర్శన్ భద్రత కై డిమాండ్.


ఖమ్మంలో సుదర్శన్ ను

పరామర్శించిన డబ్ల్యుజేఐ బృందం 


ఖమ్మం, అక్టోబర్ 20 :-


ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి

ఖమ్మం ప్రైవేటు వైద్యశాలలో 

చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల  పత్రిక విలేఖరి సుదర్శన్ ను బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది.

బీరుబాటిలళ్ళు, ఇనుప రాడ్లతో ఆరుగురు వ్యక్తులు జరిపిన దాడిలో ఛాతి, దవడ ఎముకలు విరిగి ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న సుదర్శన్ ను పరామర్శించిన డబ్ల్యూజేఐ నేతలు ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


సుదర్శన్ పై దాడి ఘటనలో పాల్గొన్న వ్యక్తులకు సంబంధించి వీడియో ఫుటేజ్ సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అయినప్పటికీ, ఇందులో కేవలం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కుపంపి, మరో ముగ్గురి విషయంలో విచారణ పేరిట కాలయాపన చేస్తుండటం అనేక అనుమానాలకు తావునిస్తున్నదని యూనియన్ నాయకులు తాడూరు కరుణాకర్, న్యాలకొండ అనిల్ రావు అన్నారు. 


ఇల్లందు పోలీసులు రాజకీయ నేతలు,లేదా ఇతరత్ర ఒత్తిళ్లకు తలవొగ్గి ఈ కేసులో నిందితులను ఉపేక్షిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

సుదర్శన్ పై గతంలో కూడా హత్యాయత్నం జరిగిందని, అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల నుండి ఆయన బతికి బయటపడ్డారని, కనుక భవిష్యత్తులో ఆయన ప్రాణాలకు

రక్షణ కల్పించే బాధ్యత స్థానిక పోలీస్ యంత్రాంగంపైనే ఉందన్నారు.


జర్నలిస్ట్ సుదర్శన్ పై జరిగిన పాశవికదాడిని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు తావు లేదన్నారు. ఒక పాత్రికేయునిపై దాడి జరపడం అంటే, అది యావత్ పాత్రికేయ లోకంపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు.


జిల్లా మంత్రి, ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉందని,ఇల్లందు ఘటనపై సమగ్ర విచారణ జరిపించి,దోషులు ఎంతటి వారైనాకఠినంగా శిక్షలు పడే ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేశారు.


ఖమ్మం ఆస్పత్రిలో జర్నలిస్టు సుదర్శన్ వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించిన వారిలో డబ్ల్యూజేఐ నాయకులుఆడెపు లక్ష్మీనారాయణ, డి శ్రీధర్  ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్