సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతి అరెస్టు


 *సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతిని అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు*


మేడ్చల్ కోర్టులో హాజరపరిచిన పోలీసులు


*సబ్ రిజిస్ట్రార్ జ్యోతి కి 14 రోజులు పాటు రిమాండ్ విధించిన మేడ్చల్ కోర్ట్*


సుభాష్ నగర్ లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసిన పద్మాజా రెడ్డి


అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన జ్యోతి


నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్కు పద్మజా రెడ్డికి సహకరించిన జ్యోతి


ఇటీవల (టిఆర్ఎస్ లీడర్) పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పోలీసులు 


 ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టార్ జ్యోతి అరెస్ట్



*నకిలీ రిజిస్ట్రేషన్‌ కేసులో 14 రోజుల రిమాండ్‌*


*తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతో భూ రిజిస్ట్రేషన్‌*


 *యజమాని బతికుండగానే మరొకరికి బదలాయింపు*


* కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన వుజ్జిని జ్యోతిని జీడిమెట్ల పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. మేడ్చల్‌ జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ ప్రాంతంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన లెంద్యాల సురేశ్‌కు జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌ వెంకటాద్రినగర్‌లో 200 గజాల స్ధలం ఉంది. ఆ స్ధలం ఖాళీగా ఉండటంతో స్థానిక బీఆర్‌ఎస్‌ నేత పద్మజారెడ్డి మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి స్థల యజమాని బతికుండగానే మృతి చెందినట్టు మరణ ధ్రువీకరణ పత్రం, నకిలీ పాన్‌కార్డు, ఆధార్‌కార్డులను సృష్టించారు. 2023 ఫిబ్రవరిలో అప్పటి కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న జ్యోతి ఆ స్థలాన్ని పద్మాజారెడ్డి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు అందడంతో ఈ నెల 4న పద్మాజారెడ్డితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.*

విచారణ నిమిత్తం తిరిగి పద్మాజారెడ్డిని అదుపులోకి తీసుకున్న జీడిమెట్ల పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. తనకు సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతితో పాటు మరి కొందరు వ్యక్తులు ఈ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌కు సహకరించినట్టు ఆమె వెల్లడించడంతో.. ప్రస్తుతం నాంపల్లిలోని చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న జ్యోతిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్‌ తెలిపారు. అదేవిధంగా ఈ నకిలీ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన మరికొందరు ప్రజాప్రతినిధులపై కూడా విచారణ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.*


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్