రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం-ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్




రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్  పోటీలకు ఆహ్వానం-ఖమ్మం  పోలీస్ కమిషనర్ సునీల్ దత్


పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని ఖమ్మం  పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీలోపు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్  పి ఆర్ వో  కు అందజేయాలన్నారు.

ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు  అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు) తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది. మరిన్ని వివరాల కోసం 8712659256 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్