EGMMలో DDUGKY కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు దుర్వినియోగం
EGMM)లో DDUGKY కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు దుర్వినియోగం
హైద్రాబాద్, (గూఢచారి):
తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఎంపాయ్మెంట్ జనరేషన్ & మార్కెటింగ్ మిషన్ (EGMM)లో DDUGKY కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు దుర్వినియోగం, శిక్షణ సంస్థలదే రాజ్యం EGMM పరిపాలనాధికారి (AO) చెప్పిందే వేదం, ప్రభుత్వానికి తెలియని వైనం EGMM ను ఇతర సంస్థలో విలీనం చేయకుండా DDUGKY కేంద్ర ప్రభుత్వం ఈశిక్షణ కార్యక్రమాన్ని సస్పెండ్ చేసినప్పటికీ మారని వైఖరి. శాటిలైట్ చానెల్ నందు సంస్థ నిర్వాకం పై వార్త, ఇప్పటి వరకు ఏఒక్క ఉన్నాతాధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియని వైనం, హైదరాబాద్ లో EGMM హెడ్ ఆఫీసు కార్యాలయం ఉన్న సంగతి కనీసం రాష్ట్ర ప్రభుత్వం వారికి, ప్రిన్సిపాల్ సెక్రెటరి గారికి తెలియకపోవడం గమ్మత్తు విషయం. అసలు EGMM కార్యకలాపాలే ఏమి లేవు. పట్టించుకునే వారే లేరు పరిపాలనాధికారి(AO) చెప్పిందే వేదం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ తో ఫైలు ప్రాసెస్ చేసి, తను పెట్టిన ఫైలు ఉన్నాతాధికారులచే ఆమోదం, బదిలీ కాకుండా అక్కడే పనిచేస్తూ AO ఇష్టారాజ్యం.విచిత్రం ఏంటంటే 33 జిల్లాలో 64 మంది కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ EGMM ఉద్యోగులు పని చేస్తుంటే, కేవలం హైదరాబాద్ లో EGMM హెడ్ ఆఫీస్ నందు 30 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారంటే ఆలోచించాల్సిన విషయం. అసలు EGMM హెడ్ ఆఫీస్ నందు ఉన్న వారి విధులు ఏమిటో, ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. పైలు ప్రాసెస్ చేయుటకు లేని ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్, మరియు పర్యవేక్షణ అధికారి. అసలు విషయం ఏమిటంటే EGMM హెడ్ ఆఫీస్ నందు ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయ్ లు వారికి నచ్చినట్టుగా నోట్ పైలుపెట్టుకొని ఆమోదించుకోవడం. లక్షల్లో జీతాలు, ఇతర అలవెన్సులు పెంచుకోవడం. ప్రవైట్ శిక్షణ సంస్థల నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టడం. విడుదల అయ్యే సమయంలో శిక్షణ సంస్థల నుండి EGMM AO, SMMలు, పంచాయతి రాజ్ కమిషనరేట్ కార్యాలయ CFOకి వాటాల వారిగా పంపిణి?
Comments
Post a Comment