IAS అధికారులకు CAT బిగ్ షాక్


 IAS అధికారులకు CAT బిగ్ షాక్

 

హైదరాబాద్ , అక్టోబరు 15 (Gudachari) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) లో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులకు గట్టి షాక్ తగిలింది . డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని క్యాట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి సంబంధిత ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం విచారించిన క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. డీఓపీటీ ఆదేశాల మేరకు రిపోర్టు చేయాలని, ఎక్కడ ఉన్నా రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. యథావిధిగా రేపు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. IASల కేటాయింపుపై DoPTకి పూర్తి అధికారాలు ఉంటాయి. స్థానికత ఉన్నప్పటికీ మార్పిడికి మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయా?, అని క్యాట్ ప్రశ్నించింది. కాగా, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ , ఆమ్రపాలి కాటా , ఎ. వాణీ ప్రసాద్ , డి. రోనాల్డ్ రోస్ , జి. సృజన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో చేసిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రొనాల్డ్లు ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.  ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్  ప్యానల్ కౌన్సిల్  ఎ. రాధాకృష్ణ వాదనలు వినిపించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్