చలనం లేని తెలంగాణ PCB
పీసీబీ వెబ్సైట్ సిటిజన్ చార్టర్ లో ఉన్న old సమాచారం |
చలనం లేని తెలంగాణ PCB
హైద్రాబాద్, ( గూఢచారి) : తెలంగాణ PCB చలనం లేని, లక్ష్యం లేని సంస్థ గా తయారు అయ్యింది. లోపం ఎక్కడ ఉంది అనేది మంత్రులకు కూడ తెలువకుండ ఉన్నట్లు ఉంది. సాక్షాత్తూ మంత్రి వర్యులు పీసీబీ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేయడం ఈ విషయం పై వార్తలు రావడం బహిరంగ రహస్యమే. హై కోర్టు కూడ అందరి ఆఫీసర్ల కు ఛాయిస్ కొరకు ఒక్కరూ నోటీసు ఇస్తే ఇంకొకరు యాక్షన్ తీసుకుంటారా అంటు అందరికీ ఛాయిస్ వచ్చేలా ప్రవర్తిస్తున్నారని వాఖ్యలు చేయడమే కాకుండా పీసీబీ నీ ముసివేయాలా అని గట్టిగా హెచ్చరించడం వీటి పై వార్తలు వచ్చినా వారిలో ఎలాంటి మార్పులు రాలేదన్నది, చలనం లేదన్నది నగ్న సత్యం.
ఈ సంస్థ కు చాలా వరకు ఆక్టు, నిభందనలు, రూల్స్ తెలియని వారిని, చట్టం లో పేర్కొన్న అర్హతలు లేని వారినే ఎక్కువ సార్లు రాష్ట్ర అధికారిగా నియమించడం ఒక్క ఎత్తయితే, నియమింప బడిన అధికారులు కాలుష్యం ఎంత తగ్గించ కలిగామని కాకుండా, తూ తూ మంత్రంగా మీటింగులు, రివ్యూలు, టాస్క్ ఫోర్స్ మీటింగులు, క్లోజర్ ఆర్డర్ లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వాటిలో ఎంత వరకు అమలు అయ్యాయి అనే దానిపై మాత్రం రివ్యూ చేసినట్లు కనపడదు. ఈ సంవత్సరం లో క్లోజర్ ఆర్డర్ ఇచ్చిన వాటిని రీజినల్ స్థాయి అధికారులు అమలు పరిచారా లేదా అన్న విషయం పట్టిచ్చుకున్న ఆఫీసర్ ఒక్కరైనా ఉన్నారా అన్నది ప్రశ్న గా మిగిలింది. మేము ఆర్డర్ ఇచ్చాం చేతులు దులుపేసుకుంటాం అన్న చందంగా ఉంది.
ఈ సంస్థ వెబ్సైట్ లో సిటిజన్ చార్టర్ లో a నుండి i వరకు పేర్కొన్న అధికారులు ల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే భాద్యతలలో ఉన్నారు. చాలా వరకు ట్రాన్స్ఫర్ అయ్యారు. రిటైర్డ్ అయ్యారు. వాటిని మార్చకుండా, ప్రజలకు సరైన సమాచారము ఇవ్వడం లో కూడ విఫలం చెందుతున్నారు. దు... మీద వాన పడ్డట్లుగా చలనం లేని, పని చేయని సంస్థ గా తయారు అయ్యిందన దానికి సాక్ష్యం.
Comments
Post a Comment