లడ్డు వివాదం లో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన TTD EX EO ధర్మారెడ్డిని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ
లడ్డు వివాదం లో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన TTD EX EO ధర్మారెడ్డిని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ
భువనగిరి, (గూఢచారి) ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం లో కేంద్ర బిందువుగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి యాదాద్రి జిల్లాలోని భువనగిరి పరిధి లోని మానేపల్లి హిల్స్ నిర్మించిన స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంనకు విచ్చేసిన సందర్భంగా
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కర్తలు, ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు దంపతులతో పాటు వారి కుమారుడు మానేపల్లి మురళీకృష్ణ వీరిని సాదరంగా ఆహ్వానించి ధర్మారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విభాగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ని ఈ విధంగా సత్కరించడం పై విమర్శలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పోలీసు హౌసింగ్ చైర్మెన కోలేటి దామోదర్ కూడా ఉన్నారు.
Comments
Post a Comment