Posts

Showing posts from November, 2024

తెలంగాణలో నిలిచిన మద్యం సరఫరా

Image
 *💥తెలంగాణలో నిలిచిన మద్యం సరఫరా* 👉🏼 రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి నిలిచిన మద్యం సరఫరా •👉🏼మద్యం డిపోల నుంచి మద్యం తెచ్చుకోలేక డీలర్ల తంటాలు 👉🏼ధరలు పెంచేందుకు సర్వర్ సమస్య అని చెపుతున్నారు అని డీలర్ల అనుమానం. 👉🏼 48 గంటలుగా ఆగిన డెలివరీ.. 👉🏼 మద్యం షాపుల్లో నిండుకున్న స్టాక్

భ‌ద్ర‌తా క‌మీష‌న్ & పోలీసు కంప్ల‌యింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

Image
 రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మీష‌న్ & పోలీసు కంప్ల‌యింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ లేఖ యధాతధంగా చదవండి గౌ// ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ రాష్ట్రం హైద‌రాబాదు అయ్యా ! పోలీసుశాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు కావాల‌ని స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత ఎన్నో క‌మిటీలు సిఫార‌సు చేయ‌గా చివ‌ర‌కు 2006 సంవ‌త్స‌రంలో సుప్రీమ్‌కోర్టు వారు తీర్పు వెలువ‌రిస్తూ ఆరు మార్గ‌ద‌ర్శ‌కాలు సూచించినారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మీష‌న్ ఏర్పాటు అలాగే పోలీసు కంప్ల‌యింట్ అథారిటీ ఏర్పాటు . భ‌ద్ర‌తా క‌మీష‌న్ పోలీసుశాఖ ప‌నితీరును నిశితంగా స‌మీక్షించ‌డ‌మే కాక వారికి స‌రియైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తూ పోలీసుశాఖ వారు చ‌ట్ట ప్ర‌కార‌ము ప‌నిచేసే విధంగా స‌హ‌క‌రిస్తుంది. ఇక పోలీసు కంప్ల‌యింట్ అథారిటీ, రాష్ట్ర మ‌రియు జిల్లాలో ప‌నిచేస్తుంది. రాష్ట్ర కంప్ల‌యింట్ అథారిటీ విశ్రాంత హైకోర్టు జ‌డ్జి ఆద్వ‌ర్యంలో ఐ.పి.ఎస్‌. అధికారుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను విచారిస్తుంది. అలాగే జిల్లా అథారిటీ విశ్రాంత జిల్లా జ‌డ్జి ఆద్వ‌ర్యంలో డి.ఎస్‌.పి. మ‌రియు క్రిందిస్థాయి అధికారులపై వ‌చ్చే ఫిర్యాదుల‌ను విచ

ఎట్టకేలకు బయటకొచ్చిన హర్ష సాయి.

Image
ఎట్టకేలకు బయటకొచ్చిన హర్ష సాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న హర్ష సాయి. నేను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు : హర్ష సాయి రాజేంద్ర నగర్, గతకొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమయ్యాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి. ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ” ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడ పని పూర్తి చేసుకుని నేడు తిరిగి హైదరాబాద్ వచ్చాను. నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అసత్యం కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయింది. నేను రాసిన నేను తీసినటువంటి సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారు. నేను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా అదే జరిగింది. మధ్యలో ఉన్నటువంటి కొందరు ఈ విధంగా కావాలని నన్ను ప్రజలలో చులకన చేయడానికి నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేశారు. కానీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటికి వచ్చేయి కాబట్టే ఈ రోజు నాకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాను” అని అన్నారు.

ఓ ఆర్ ఆర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

Image
 *ప్రమాదాల నివారణ కోసం...*  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణించే వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్  (టోల్ బూత్)ల సమీపంలో  పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్  టెస్టులు నిర్వహిస్తారు.

*ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ ఒకే కులానికి ఒప్పుకుంటారా? - స్కైలాబ్ బాబు

Image
 *ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ ఒకే కులానికి ఒప్పుకుంటారా?*    *రాజ్యాంగాన్ని మార్చే మోదీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టండి* *అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలి* *కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*  *టి స్కైలాబ్ బాబు* దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం వనేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుందని, దేశ ప్రజల సమైక్యతకు కావలసింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని, భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.  శనివారం నల్లగొండ దొడ్డి కొమురయ్య భవన్ లో కెవిపిఎస్ జిల్లాస్థాయి సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశనికి ముక్య అతిధిగా పాల్గొన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 110 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విభిన్న వైవిధ్యాలు కలిగిన దేశంలో దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైన నిలబెట్టడానికి, కులం మతం భాషా ప్రాంతం అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండే వ

సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ఉప్పల

Image
 *సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ఉప్పల* హైద్రాబాద్, (గూఢచారి ప్రత్యేక ప్రతినిధి): నాగోల్ యాదవ సంఘం నాగోల్ కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్ గారు, చింతల కిరణ్ కుమార్ యాదవ్ మరియు ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవాల్లో TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ , మాజీ ఎంపీ మధు యాష్కీ మరియు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్  సామ రంగారెడ్డి తో కలిసి పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యాదవుల ఐక్యత,పాడిపంటలు పశువు సంపదను ప్రతిబింబిస్తూ ప్రతి యోట నిర్వహించే సదర్ పండుగ ఉత్సవాలలో భాగంగా యాదవ్ సోదరుల ఆహ్వానం మేరకు పాల్గొనడం సంతోషకరం అని ఆయన అన్నారు.  ఆ కృష్ణుని ఆశీస్సులతో యాదవ సోదరులు అందరూ సంతోషంగా ఉండాలని అన్ని కులాల వారితో మంచిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అధికారికంగా సదర్ సమ్మేళనం జరపడం సంతోషం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదవ సోదరులు దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసుకునే సదర్ ఉత్సవాలను ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడం సం

10 సంవత్సరాలలో ఎన్నికలు పెట్టారా? గంపా నాగేందర్ గారు

Image
 10 సంవత్సరాలలో ఎన్నికలు పెట్టారా? అంటూ రాష్ట్ర రైస్ మిల్లర్లు అధ్యక్షుడు గంప నాగేందర్ ను ప్రశున్స్తూ ఆడియో వైరల్  ఈ క్రింద టచ్ చేసి వినవచ్చు. 👇👇👇 Watch audio👇👇

తిరుమల తిరుపతి బోర్డు ఛైర్మెన్ & మెంబర్లు

Image
 తిరుమల తిరుపతి  బోర్డు ఛైర్మెన్ & మెంబర్లు

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్.

Image
  బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్. సంచలన వాఖ్యలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అన్న మహేశ్వర్ రెడ్డి జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు  ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు  కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. దూరం నుంచి చూసి వచ్చాడు మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదు  నేను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతాను -

జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం - నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి

Image
 జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం  - నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి  - ఐకాన్ హాస్పిటల్ ఎండి కోడే శశాంక్  నల్లగొండ, నవంబర్ 1  నిత్యం విధి ఒత్తిడిలో ఉండి మానసిక ఇబ్బందులకు గురవుతున్న జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ అటానమస్ ఆధ్వర్యంలో ఐకాన్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ ను అందరు జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వినియోగించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. హైదరాబాద్ కు దీటుగా నల్లగొండలో అత్యధిక వైద్య సేవలు అందిస్తున్న ఐకాన్ హాస్పిటల్ కు ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్వహకులు కూడా సహకారం అన్నారు. ఐకాన్ హాస్పిటల్ ఎండి కోడే శశాంక్ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ త