ACB NEWS: జీవీఎంసీ జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం పై ఏ.సీ.బీ. సోదాలు.
ACB NEWS: జీవీఎంసీ జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం పై ఏ.సీ.బీ. సోదాలు.
విశాఖ...మధురవాడ...
ఉలిక్కిపడిన జీవీఎంసీ అధికారులు, సిబ్బంది.
విశాఖ,విజయనగరం,
శ్రీకాకుళం సహా హైదరాబాద్ లో... మరియు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు
ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు గుర్తించిన అధికారులు కేసులు నమోదు.
యాంకర్...
మధురవాడలోని జీవీఎంసీ జోన్-2 జోనల్ కమిషనర్ పొందూరు సింహచలంపై మంగళవారం ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది.ఉదయం నుంచి ఏసీబీ అధికారులు జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. అవినీతి,అక్రమాలపై సింహాచలంపై వరుసగా ఫిర్యాదులు వాటిపై నిగా ఉంచిన ఏసీబీ అధికారులు తనిఖీలకుదిగారు.వక్రమార్గంలోనే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు కేసు నమోదు చేశారు.ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు విశాఖ అధికారులు స్థానిక స్పెషల్ జడ్జీ అనుమతితో ఏకకాలంలో ఆరు ప్రదేశాలలో సోదాలు చేపట్టారు.మధురవాడ, మిథిలాపురి కాలనీలోని జోనల్ కమిషనర్ ఇల్లు,మధురవాడలోని జోనల్ కార్యాలయం,శ్రీకాకుళం జిల్లాలోని ఆయన ముగ్గురు బంధువుల ఇళ్లు,హైదరాబాద్ లోని బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో సోదాలు జరిపి అవినీతి సొమ్ము, ఆస్తులను లెక్కతేల్చుతున్నారు.ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు ప్రకటించారు.సోదాలలో ఏసీబీ జేడీ ఎం.రజని,అదనపు ఎస్పీ ఎన్.విష్ణు, డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వర రావు, డీఎస్పీ రమ్య పర్యవేక్షణలో విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం, కర్నూలు ప్రాంతాల ఏసీబీ అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు.ఇప్పటి వరకూ జరిపిన విచారణలో సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు.త్వరలోనే సింహాచలాన్ని అరెస్టు చేసి,కోర్టులో ప్రవేశపెడతామని దర్యాప్తు అధికారి,విశాఖఏసీబీ సీఐ వై.కిషోర్ కుమార్ మీడియాకు తెలిపారు.
Comments
Post a Comment