రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
*రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి *
హైద్రాబాద్, గూఢచారి:
రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు, వారి సమస్యలను వినడానికి ,పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచిపద్దతి కాదు . లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదు
జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్నకలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారు
అధికారుల మీద దాడి అనేది మనమీద మనం దాడి చేసుకున్నట్లే!
రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు
కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు
గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలి
ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారు?
బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం వెలగబెట్టిననాడు ఇదే పద్దతి చేశారా?
ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు.
మల్లన్నసాగర్ లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారు.
పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా?
ఎగిసి ఎగిసి పడుతున్న కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా?
లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా?
Comments
Post a Comment