ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించిన పోలీస్ కమిషనర్


 

*ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించిన పోలీస్ కమిషనర్* 

ఖమ్మం, (గూఢచారి ప్రతినిధి నాని): ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ శాఖ మన్ననలు పొందారని పోలీస్ కమిషనర్ కొనియాడారు. రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.  


*ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు*


 1) N.నాగేశ్వరరావు ASI

 2) పి. క్రిష్ణయ్య, ఏఆర్‌ఎస్‌ఐ

 3) జి. సూర్యారావు, ఏఆర్‌ఎస్‌ఐ


ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, ఆర్ ఐ కామరాజు, పోలీస్ అసోసియేషన్ జానీమియా, పంతులు పాల్గొన్నారు.


                             

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్