బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్* అవేర్నెస్ ప్రోగ్రాం.


 *బాల సురక్ష కార్యక్రమం 

 సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్* అవేర్నెస్ ప్రోగ్రాం.

కోదాడ, (గూఢచారి ప్రతినిధి మిట్టపల్లి శ్రీనివాస్)

కోదాడ పట్టణం లోని KSSBM ZPGHS, MPPS ఆజాద్ నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి మరియు నాలుగు, ఐదు తరగతుల బాలికలు సుమారు 200 మందికి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ బాల సురక్ష వాలంటీర్ ఇంపాక్ట్ ట్రైనర్ వీరవిల్లి శ్రీలత బాలికలకు సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ గురించి వివరించడం జరిగింది. సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల ఇబ్బందులకి గురి అవుతున్నారు. పిల్లలు శారీరకంగా మానసికంగా ఉండటానికి చైల్డ్ సేఫ్ కు సంబంధించిన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో సర్వే ప్రకారం 50 శాతం మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురిఅవుతున్నారు. 2020-22 వరకు సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది లైంగిక వేధింపులకు గురి అయ్యారని ప్రభుత్వం వారి అంచనా. ఇది బయటికి తెలిసినవి తెలియనివి కొన్ని వేలు ఉంటాయి ఇలాంటి సొసైటీలో మన పిల్లలు జీవిస్తున్నారు మన పిల్లలకి, పిల్లలు యొక్క తల్లిదండ్రులకి, టీచర్స్ కి, కేర్ టేకర్స్ కి ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో పిల్లలకి సేఫ్ టచ్ అంటే ఏమిటి అన్ సేఫ్ టచ్ అంటే ఏంటి తెలియ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.

 అలాంటి ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇలాంటి తరగతులు నేటి సమాజానికి ఎంతో అవసరమని వచ్చిన పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి నా తోటి ఇంపాక్ట్ క్లబ్ సభ్యురాలు ఎం సుభాషిని మరియు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బి సుశీల బాయ్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి వరమ్మ, మరియు స్కూల్లో ఉపాధ్యాయ బృందం, వినీత మేడమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్