ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై దాడులకు పాల్పడటం దుర్మార్గం

 



*ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై దాడులకు పాల్పడటం దుర్మార్గం* 


ప్రజలకు వివిధ రూపాలలో సేవలు అందించే ఉద్యోగులపై తమ రాజకీయ లక్ష్యాలకోసం భౌతిక దాడులకు దిగటం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ గెజిటెడ్ మరియు ఉద్యోగుల , ఉపాధ్యాయుల , నాలుగవ తరగతి ఉద్యోగుల , కార్మికుల మరియు పెన్షనర్ ల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు అభిప్రాయ పడ్డారు . వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర రెవిన్యూ ఉద్యోగులపై దాడికి నిరసనగా జేఏసీ మరియు ట్రెసా ఇచ్చిన పిలుపు మేరకు లంచ్ అవర్ డెమన్స్ట్రేషన్ లో భాగంగా గురువారం నాడు భూపరిపాలన కమీషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు .


      అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన వికారాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళితే భౌతిక దాడులకు దిగటం ప్రజలకు , యువతకు అభివృద్ధి కి దూరం చేసే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు . దాడికి పాల్పడిన వారిపైనే కాకుండా తెరవెనుక ఉండి రెచ్చగొట్టిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా వారిని కఠినంగా శిక్చించాలని అయన కోరారు .


 ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు :

1. ఎలూరీ శ్రీనివాస రావు, సెక్రటరీ జనరల్, TGEJAC & అధ్యక్షుడు, తెలంగాణ గెజిటెడ్ అధికారులు అసోసియేషన్.

2. వంగ రవీందర్రెడ్డి, అధ్యక్షుడు, TRESA.

3. ముజీబ్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి, TNGOs.

4. ఎ. సత్యనారాయణ,

ప్రధాన కార్యదర్శి,

తెలంగాణ గెజిటెడ్ అధికారులు అసోసియేషన్.

5. చంద్రమోహన్, అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్స్. అసోసియేషన్ 

6. కస్తూరి వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్, TNGOs.

5. బి. శ్యామ్, అసోసియేట్ ప్రెసిడెంట్, TGOs.

6. గౌతo కుమార్,

ప్రధాన కార్యదర్శి, TRESA.

7. మధుసూదన్రెడ్డి, అధ్యక్షుడు , తెలంగాణ లెక్చరర్ అసోసియేషన్.

8. గోల్కొండ సతీష్, అధ్యక్షుడు, VRO Assn.

9. M.b.కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ఎంజులా రెడ్డి, సుజాత, లావణ్య, తధితరుల్ పాల్గోనరు




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!