*కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం*


 *కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం*


- *ఆటో వర్కర్స్ యూనియన్ వనసమారాధనలో దయాకర్ రెడ్డి*


*ఖమ్మం, (గూఢచారి ప్రతినిధి నాని): కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం సాధ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని గోపాలపురం మామిడితోటలో ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా, అధ్యక్షుడు సిహెచ్. విప్లవ్ కుమార్ ఆధ్వర్యంలో వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అలాగే కార్మికులకు కూడా తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. మంత్రి పొంగులేటి, మరో ఇద్దరు జిల్లా మంత్రుల చొరవతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పక్షాన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. నర్సింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోదా మల్లేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బిజ్జల రామకృష్ణ రెడ్డి, ఆటో యూనియన్ పార్లమెంటు కమిటీ అధ్యక్షులు బొల్లిని నాగరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సైదులు, నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి బొడ్డు సైదులు, నగర ప్రధాన కార్యదర్శి ఎ. ప్రభాకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుక్కల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పాష, జిల్లా కార్యదర్శి దేవా, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దల నగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయుడు, నగర ఉపాధ్యక్షుడు జానీ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్