మేము నివాసం వుంటున్న యిల్లు బఫర్ జోన్లో లేదు - హైడ్రా కమిషనర్ రంగనాథ్.
మేము నివాసం వుంటున్న యిల్లు బఫర్ జోన్లో లేదు - హైడ్రా కమిషనర్ రంగనాథ్.
* మధురా నగర్లో మేము నివాసం వుంటున్న యిల్లు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు నిర్మించినది.
* కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది యిళ్ళ తర్వాత మా యిల్లు ఉంది.
* మా నాన్నగారు నిర్మించిన ఈ యిల్లు బఫర్ జోన్లో వుందని కొన్ని సామాజిక మాధ్యమాల్లో పాటు పేపర్లలో వచ్చిన వార్తలో వాస్తవం లేదు.
* ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే.
* అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కిందన వున్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు.
* అయినప్పటికీ కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మేము నివాసం వుంటున్న యిల్లు వుంది.
* వాస్తవాలు యిలా వుంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను.
* వాస్తవాలు యివి. ------------------
- మా నాన్న శ్రీ ఎ.పి.వి.సుబ్బయ్య గారు 1980 సంవత్సరంలో మేము వుంటున్న యింటిని నిర్మించారు.
- 44 సంవత్సరాల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా తండ్రితో కలిసి ఉంటున్నాము.
- ప్రస్తుత కృష్ణాకాంత్ పార్కు గా వున్న స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఉండేది. చెరువున్నప్పటి నిబంధనల ప్రకారం అయినా మేము వుంటున్న నివాసం కట్టకు ఒక కిలోమీటరు దూరంలో వుంది.
- సంస్కృతి/సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద, కట్టను ఆనుకొని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
- మేము నివాసం వుంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉంది.
- ఎక్కడైనా చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5-10 మీటర్ల వరకు వున్న స్థలాన్ని బఫర్ జోన్ గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుంది.
- 25 ఏళ్ల క్రితం పెద్దచెరువు.. ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కుగా మారిన స్థలం మా నివాసానికి 1 కి.మీ దూరంలో ఉంది. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను.
- మేము నివాసం వుంటున్న యిల్లు బఫర్ జోన్లో లేదు అనేది వాస్తవం అనేది అందరూ గ్రహించాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతున్నాను.
-
- --- ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్.
Comments
Post a Comment