*ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ ఒకే కులానికి ఒప్పుకుంటారా? - స్కైలాబ్ బాబు


 *ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ ఒకే కులానికి ఒప్పుకుంటారా?*

 

 *రాజ్యాంగాన్ని మార్చే మోదీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టండి*

*అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలి*

*కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* 

*టి స్కైలాబ్ బాబు*



దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం వనేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుందని, దేశ ప్రజల సమైక్యతకు కావలసింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని, భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.


 శనివారం నల్లగొండ దొడ్డి కొమురయ్య భవన్ లో కెవిపిఎస్ జిల్లాస్థాయి సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశనికి ముక్య అతిధిగా పాల్గొన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 110 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విభిన్న వైవిధ్యాలు కలిగిన దేశంలో దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైన నిలబెట్టడానికి, కులం మతం భాషా ప్రాంతం అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు.

 ప్రాచీన మనువాద సంస్కృతి సైదాంతిక భూమిక కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి అంబేద్కర్ ఆలోచనలను తుద ముట్టించటానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుందని విమర్శించారు .రాజ్యాంగ రక్షణ కోసం సామాజిక శక్తులు సమైక్యం కావాలన్నారు.

చట్టం ముందు అందరూ సమానులేనని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పేర్కొంటుందని చెప్పారు భారత రాజ్యాంగం భారతీయులందరికీ అర్థమయ్యే రోజు రావాలన్నారు. కేవలం న్యాయ శాస్త్ర విద్యార్థులు న్యాయవాదులకు మాత్రమే రాజ్యాంగం అర్థం కావడం ద్వారా దేశ ప్రజలందరూ మత చాందస మూఢవిశ్వాసాల మాటున ఉన్నారని చెప్పారు మత రాజ్యాలన్నీ చీకటి రాజ్యాలు అయితే భారత రాజ్యాంగం సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద సోషలిస్టు భావాలను సంతరించుకుందన్నారు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి అట్టడుగు వర్గాల హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రశ్నిస్తే నేరంగా భావిస్తున్న రోజులని ప్రశ్నించిన మేధావులైన దబోల్కర్ ఫన్సారే కల్బుర్గి గౌరీ లంకేష్ ఇటీవల ప్రొఫెసర్ జి ఎన్ సాయి బాబా మరణానికి కూడా బీజేపీ ప్రభుత్వం హత్యగావించిందన్నారు.మతాన్ని దేవుని రాజకీయాలతో మిలితం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బిజెపి ఎంఐఎం వంటి మతోన్మాద పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు .దేశ సమైక్యత సమగ్రతల కోసం లౌకిక విలువల కోసం నేటి యువతరం కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు రాజ్యాంగం మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం ఫెడరలిజం సామాజిక న్యాయం లౌకికత్వం నాలుగు మూల స్తంభాలను కాపాడుకోవాలన్నారు ప్రస్తుత దేశానికి మతోన్మాద గండం పొంచి ఉందని రాజ్యసభ స్థానాలలో రిజర్వేషన్ల తో పాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని తద్వారా సామాజిక న్యాయానికి బాట వేయాలని కోరారు ఎస్సీలలో క్రిమిలేయర్ పెట్టాలనే వాదనను ఆయన తిప్పి కొట్టారు దేశభక్తి అంటే శ్రమను గౌరవించడమే అని ఆయన పిలుపునిచ్చారు అసమానతల సమాజాన్ని అంతం చేయడం ద్వారా రాజ్యాంగ యొక్క ఉన్నత్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు .

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు ఎస్సి లకు చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ఉపాధి కల్పించాలన్నారు .ఎస్సి కార్పోరేషన్ ద్వారా ఉపాధి చూపాలన్నారు దళిత అసైన్డ్ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు 

ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివకుమార్ దైద శ్రీను కోడి రెక్క మల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు పెరిక విజయ్ కుమార్ బొల్లు రవీంద్ర కుమార్ వంటేపాక కృష్ణ ,జిల్లా కమిటీ సభ్యులు చిలుముల రామస్వామీ దండు రవి శివ లింగం వెంకటయ్య దోరేపల్లి మల్లయ్య రాజు,దిండి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్