*మహారాష్ట్ర ఎన్నికల్లో మహా అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి*
*మహారాష్ట్ర ఎన్నికల్లో మహా అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి*
నాందేడ్ / హైదరాబాద్:- మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాఅఘాడి కూటమి విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాందేడ్ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే మహాఅఘాడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహాఅఘాడి కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో మహా అఘాడి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు ఖాయమని ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు త్వరలో మహరాష్ట్ర ఎన్నికల్లో మహ అఘాడి కూటమి ఘనవిజయం సాధించడం తధ్యమని మంత్రి పొంగులేటి అన్నారు.
*రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం*
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీతో పాటు నాందేడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా నాందేడ్ న్యూ మొండా మైదానంలో జరిగిన బహిరంగ సభతో పాటు వివిధ సభల్లో రాహుల్ గాంధీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Post a Comment