మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైద్రాబాద్, (గూఢచారి): మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.
అందరికీ విద్యను అందించేలా కృషిచేసిన మహానీయుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా LB Nagar చౌరస్తా లో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే. సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. విద్యావ్యాప్తి ద్వారా కుల వివక్షతను, సాంఘిక దురాచారాలను, మూడనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి ప్రభాకర్, SC cell చైర్మెన్ జోగి గారు, మహేందర్, బిక్షపతి, సైదులు, మహేష్, శివ కుమార్, సాయి, ప్రభాకర్, భాస్కర్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment