విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు తో నే విద్యా వ్యవస్థ పటిష్టం


 

విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు తో నే  విద్యా వ్యవస్థ పటిష్టం

నల్గొండ, (గూఢచారి):
        ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు, శిక్షణ, నైపుణ్యాలతో కూడిన విద్య ఇచ్చినప్పుడే  రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టమవుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .

       మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ విద్యపై నిర్వహించిన ప్రజాభిప్రాయానికి పలువురు విద్యావేత్తలు, మేధావులు, అధ్యాపక, ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు, ప్రాథమిక విద్య నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరై ఆయా స్థాయిలలో విద్యను పటిష్టం చేసేందుకు వారి అభిప్రాయాలను తెలియజేశారు.

     తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా చైర్మన్ ఏ.మురళి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్  నుఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాలలో, వివిధ స్థాయిలలో అందరి అభిప్రాయాలను  తీసుకుంటున్నామని, కళాశాలలు, పాఠశాలలు సందర్శించి యూనియన్లు, మేధావులు, విద్యావేత్తలతో అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణలో ప్రభుత్వ విద్య బాగా ఇబ్బందుల్లో ఉందని, విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థుల నమోదు బాగా పడిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో పటిష్ట విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ కు అప్పజెప్పిన పనిపై తాము సీరియస్ గా దృష్టి కేంద్రీకరించి పిల్లలు, తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ అందరితో సంప్రదించి సలహాలు ,సూచనలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 2 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని, నల్గొండ జిల్లా మూడవదని సమస్యలు అన్నింటిని ప్రభుత్వానికి నివేదిస్తామని, ఏం చేస్తే విద్యార్థులకు, తల్లిదండ్రులు, ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటిది ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు.

          ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సాగతోపన్యాసం చేస్తూ   రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విద్యాశాఖంలో పేను మార్పులు తీసుకొచ్చిందని, ఇందులో భాగంగా విద్యార్థుల మేస్ చార్జీలను 40% పెంచిందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు, భోజనాన్ని అందించేందుకు రాష్ట్రస్థాయి నుండి బహుళ క్రమశిక్షణ బృందాల ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో సైతం వివిధ శాఖల  అధికారులతో బృందాలను ఏర్పాటు చేశామని, వారు ఎప్పటికప్పుడు పాఠశాలలు,  వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన  భోజనం, గుణాత్మక విద్య కై చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఇప్పటివరకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, గుణాత్మక విద్యను అందించడంలో  సత్ఫలితాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

     విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన పని తాను చేస్తుందని, అభిప్రాయాలను, సూచనలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తామని,  అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం అని, అదే సాధనమని, విద్య కమిషన్ తరఫున నాణ్యమైన విద్యను భవిష్యత్ తరాల విద్యార్థులకు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.
    మరో సభ్యులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పునర్ నిర్మించేందుకు విద్యా కమిషన్ తరపున కృషి చేస్తామని, విద్యార్థి కేంద్ర బిందువుగా తాము అభిప్రాయాలను అన్నింటిని సేకరిస్తున్నట్లు తెలిపారు .
   మరో సభ్యురాలు జ్యోత్స్నా రెడ్డి మాట్లాడుతూ విద్యా కమిషన్ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో వివిధ జిల్లాల నుండి ఆయా వర్గాల నుండి వచ్చిన అభిప్రాయాలను అన్నింటిని సేకరించి ఏ అంశాలలో అభివృద్ధి చేస్తే విద్య వ్యవస్థ పటిష్టమవుతుందో అందుకు తమ సూచనలు ఉంటాయని తెలిపారు.

      విద్యావిధానంలో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్య  పటిష్టత కొరకు ప్రజాభిప్రాయ సేకరణకు నిర్వహించిన ఈ సమావేశంలో ముందుగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఓఎస్ డి ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల స్థాయిలో అప్లియేటెడ్ కాలేజీలు నడపడానికి సపోర్టెడ్ స్టాఫ్ ను ఇవ్వాలని, అలాగే మౌలిక వసతులు పెంచాలని అన్నారు.

    ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో కళాశాలలకు యుజిసి నుండి నిరంతరం గ్రాంట్స్ వచ్చే విధంగా చూడాలని,  నాక్ మతి లేకుండా కొన్ని కళాశాలలకు నిధులు విడుదల చేస్తున్నారని, ఆ తేడాలు లేకుండా చూడాలనుకోరారు .

     ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ మాట్లాడుతూ యు జి సి నుండి రెగ్యులర్ ఫండ్స్ విడుదల చేయాలని, కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ఉండేలా చూడాలని అన్నారు.

      ఎన్జీ కళాశాల విద్యార్థి తండ్రి కనకయ్య మాట్లాడుతూ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీలకు సరైన జీతాలు ఇవ్వాలని, సరైన ఫ్యాకల్టీ తో పాటు, ల్యాబ్ లు, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి సంవత్సరం ప్లేస్మెంట్స్ ఇవ్వాలని సూచించారు

       డాక్టర్ మహేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, గెస్ట్ టీచర్స్ కు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని, దానివల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని,  యూనివర్సిటీ స్థాయిలో పరిశోధన పనులపై దృష్టి సారించాలని, మల్టీ డిస్ప్లేనరీ కోర్సులు ఏర్పాటు చేయాలని సూచించారు .

     ఇంటర్మీడియట్ విద్య పై జరిగిన అభిప్రాయం లో భాగంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దసృ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోకుండా ఉండేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, జూనియర్ కళాశాల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, 11,12 వ తరగతిలు ఉన్నత విద్యలో కాకుండా సేపేరేట్ గా నిర్వహించాలని సూచించారు.

     నార్కెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని, కళాశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, క్రమం తప్పకుండా ఇంటర్ స్థాయిలోనే మూల్యాంకనం నిర్వహించాలని సూచించారు.

    గవర్నమెంట్ జూనియర్ కళాశాల  జూనియర్ లెక్చరర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలోనే మూల్యాంకనం అనేది ఉండాలని అప్పుడే ఇంటర్ విద్యా వ్యవస్థ పటిష్టమవుతుందని అన్నారు .

     నాగార్జునసాగర్ జూనియర్ కళాశాల లెక్చరర్ రాజేశ్వర్ మాట్లాడుతూ ఇంటర్లో సంస్కరణలు చాలా అవసరం. కోర్స్ మొత్తాన్ని పునర్నిర్మించాలి. ఎంపీసీ, బైపీసీ లాంటివి తీసివేసి ఎంబైపీసీని పెట్టాలి .అదేవిధంగా ఆర్ట్స్లో మ్యాథ్స్, కంప్యూటర్ సబ్జక్ట్స్ పెట్టాలని, అసైన్మెంట్స్ ఉండాలని, ఇంటర్మీడియట్ లో సెమిస్టర్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు.

      గృహిణి ఉజ్వల మాట్లాడుతూ గేస్ట్ లెక్చరర్స్ తో పాటు, కాలేజీలో పని చేసే అధ్యాపకులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని సూచించారు.

        ప్రభుత్వ బాలుర  ఉన్నత పాఠశాల నుండి శాంతి మాట్లాడుతూ తాము చదువుకునేందుకు ఉన్నత విద్యా స్థాయిలో ప్రత్యేకించి ఉన్నత పాఠశాలలో ల్యాబులు ,కంప్యూటర్లు, లైబ్రరీ, ప్రయోగశాలలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.

     ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ నాలెడ్జి తప్పనిసరి ఏర్పాటు చేయాలని అన్నారు.

      మరో విద్యార్థి అవినాష్ మాట్లాడుతూ సిలబస్ ను మార్చాలని ,మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ తో సిలబస్ ఉండాలని, ప్రత్యేకించి పాఠశాలల సమయాన్ని తగ్గించాలని, ప్రాక్టికల్స్ పెట్టాలని సూచించారు. అదేవిధంగా బేసిక్ స్కిల్స్ నేర్పించాలని, రీడింగ్, రైటింగ్ వంటివి తప్పనిసరి అని అన్నారు.

      నస్రత్ అఫియా మాట్లాడుతూ ప్రభుత్వ సెక్టార్లో విద్య నాణ్యతను పెంచాలని, కంప్యూటర్ నాలెడ్జ్ పెంచాలని, వోకేషనల్, స్కిల్ కోర్సులు పాఠశాల స్థాయి నుండి ప్రవేశపెట్టాలని, లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

       ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి నశ్రీన్ మాట్లాడుతూ ఇంగ్లీష్ స్పీకింగ్  స్కిల్స్ విద్య ఉండాలని, లైబ్రరీలు ,పుస్తకాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు విద్యతో పాటు ,శారీరక కార్యక్రమాలు, క్రీడలను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని, ప్రయోగాత్మక విద్య అతి ముఖ్యమని అన్నారు.

     బీఈడీ విద్యార్థిని జయ మాట్లాడుతూ లైబ్రరీలు, సౌకర్యాలు కల్పించాలన్నారు

     బొట్టుగూడ పదవ తరగతి విద్యార్థి మారుతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తో పాటు, స్పెషల్ క్లాస్ లు నిర్వహించాలని, ఉన్నత పాఠశాల స్థాయిలోనే వీటిని నిర్వహించాలని సూచించారు.

     డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యను అప్డేట్ చేయాలని సూచించారు.

      ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని ,విద్యార్థులకు అల్పాహారం ఇవ్వాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.

      ఎంపీపీ ఎస్ పాఠశాల హెడ్మాస్టర్ లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ ప్రైమరీవిద్యను బలోపేతం చేయాలని సూచించారు.

     డివిఎస్ ఫణికుమార్ మాట్లాడుతూ హై స్కూల్ స్థాయి వరకు మౌలిక సదుపాయాలు పెంచడం ,విద్యలో సిసి విధానాన్ని తీసివేయడం, సిలబస్ ను సమీక్షించడం చేయాలన్నారు.

     డైట్ కళాశాల నుండి నరసింహ మాట్లాడుతూ ప్రతి డైట్ కళాశాలలో డిపిఈఎస్ కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు .

     రాష్ట్ర మోడల్ స్కూల్స్ అధ్యక్షులు జగదీష్, తదితరులు మాట్లాడారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్ఓ అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్