తమ ఇంట్లో జరిపించే పెళ్లిల భావించి ఓ దివ్యాంగ జంట పెళ్లిని జరిపింంచిన జగిని శ్రీనివాస్ గుప్తా
తమ ఇంట్లో జరిపించే పెళ్లిల భావించి ఓ దివ్యాంగ జంట పెళ్లిని జరిపింంచిన జగిని శ్రీనివాస్ గుప్తా
హైద్రాబాద్: ఓ దివ్యాంగ జంట పెళ్లిని తమ ఇంట్లో జరిపించే పెళ్లిల భావించిన జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తా, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్,యడవెల్లి బాలరాజు, రామ్ సేవా సమితి చైర్మన్ నర్సింహారావు లు అంగరంగ వైభవంగా ఉచిత వివాహం జరిపించారు. సైదాబాద్ డివిజన్, SBH కాలనీ లోని శ్రీ శ్రీనివాస కమ్యూనిటీ హల్ లో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా మౌనిక,రాజేష్ ల వివాహాన్ని కన్నుల పండుగగా జరిపారు. నూతన దంపతులకు పుస్తె, మట్టెలు, పెళ్లి బట్టలతో విందు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్బంగా జగిని శ్రీనివాస్ మాట్లాడుతూ...నిరుపేదలైన రాజేష్-మౌనిక లు వారి పెళ్లి నిమిత్తం మమ్ములను సంప్రదించగా... వారికి మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఈ రోజు వారికి ఎలాంటి లోటు లేకుండా ఉచిత వివాహం జరిపించామని తెలిపారు. సామాజిక సేవలో భాగంగా గతంలో కూడా ఇలాంటి ఉచిత వివాహలు ఎన్నో జరిపించామని అన్నారు. నిరుపేదలు, దివ్యంగులు వారి వివాహం కోసం మమ్ములను సంప్రదిస్తే....వారికి అన్ని విధాలుగా అండగా వుంటూ వారి వివాహాన్ని జరుపుతామని తెలిపారు
Comments
Post a Comment