Revanth Reddy: విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి


 

Revanth Reddy: విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి

* ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు* 

*లేనివి ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న* వారిపై కఠిన చర్యలు


Hydrabad, gudachari: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.


* బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు కూడా వెనుకాడ‌బోమని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ పాఠశాలలు, వ‌స‌తిగృహాలు, గురుకులాలను త‌నిఖీ చేసి, నివేదిక‌ల‌ను సమ‌ర్పించాల్సిందే అని ఆదేశించారు. 


*గడిచిన పదేండ్లలో గాడితప్పిన విద్యా వ్యవస్థను తిరిగి దారిలో పెట్టే క్రమంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.


*విద్యార్థినీ విద్యార్థుల విష‌యంలో సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ కొంద‌రు దురుద్దేశంతో ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, లేనివి ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి అధికారులను ఆదేశించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్