108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగ....
*హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్,ఫైటింగ్...*
హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగ....
దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు...
హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన దొంగ...
అంబులెన్స్ సైరన్ తో రయ్ రయ్ మంటూ అతి వేగంతో పరారవుతున్న దొంగ. .
చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయిన దొంగ....
జాన్ రెడ్డి పరిస్థితి విషమం,చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..
కేతేపల్లి (మం)కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయిన కేటుగాడు...
సూర్యాపేట (మం)టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు...
పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.
Comments
Post a Comment