వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ 60వ జన్మదినోత్సవ సందర్భంగా సామూహిక బోజనాలు








వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ 60వ జన్మదినోత్సవ సందర్భంగా సామూహిక బోజనాలు


హైద్రాబాద్: 

ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంటు, తన సేవా దృక్పథం ద్వారా అందరి మన్ననలు పొందిన కౌటికె విఠల్ గారు, తన పాలసీదారుల జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా ఒక నూతన ఆదర్శానికి నాంది పలికారు.

ఈరోజు వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, కౌటికె విఠల్ గారు వెయ్యి మంది అన్నార్తులకు భోజన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, "నా విలువైన పాలసీదారులు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం ఉంది" అని తెలిపారు.


ఈ ప్రత్యేక సేవా కార్యక్రమానికి తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్, శ్రీమతి కలువ సుజాత గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు చందా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


  చందా శ్రీనివాసరావు మాట్లాడుతూ, "తన పాలసీదారులపట్ల కౌటికె విఠల్ గారు చూపించే నిబద్ధత, సేవా తత్పరత ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రతి విలువైన పాలసీదారుడి జన్మదినానికి 1000 మందికి భోజనం అందించడం ఆయన దానగుణానికి నిదర్శనం" అని కొనియాడారు.


మరో ముఖ్య అతిథి శ్రీమతి కలువ సుజాత గారు మాట్లాడుతూ, ఎర్రం విజయ్ కుమార్ తన నిస్వార్థ సేవలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విఠల్ గారు ఈ సేవా కార్యక్రమాన్ని వారి జన్మదినం సందర్భంగా చేపట్టడం ఎంతో గొప్పది. ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం మానవతా ధర్మానికి అద్భుత ఉదాహరణ" అని తెలిపారు.


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులైన కౌటికె విఠల్ ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ కార్యక్రమం గా నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీ వెంకటేశ్వర రావు , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ నటుకుల గురు ప్రసాద్, కౌటికె ఆదిత్య హాజరయ్యారు.


ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ, "తన పాలసీదారుల జన్మదినోత్సవాలను పురస్కరించుకొని అన్నార్తులకు భోజన వసతులు కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక తృప్తి పొందుతున్నాను. ఇదే సేవా దృక్పథంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను" అని తెలిపారు.


ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కౌటికె విఠల్ సేవా తత్పరతను, పాలసీదారుల పట్ల ఆయన చూపే అంకితభావాన్ని ప్రశంసించారు. అంతే కాక, ఈ కార్యక్రమం ద్వారా పాలసీదారుల, ఆయనపై నమ్మకాన్ని మరింత బలపరిచారు.


కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా, విఠల్ , ఎర్రం విజయ్ కుమార్ కి "అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలను సాధించి సమాజానికి మరింత సేవ చేయాలి" అని అభినందనలు తెలియజేశారు.


ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి కలువ సుజాత కుమారుడు మరియు మనవడి జన్మదినం ఇదే రోజు కావడం వల్ల వారి కుటుంబ సభ్యులు అంతా కూడాను ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది


 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్