ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం
ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం
*ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ*
*EQ of M: 5.3, On: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, Depth: 40 Km, Location: Mulugu, Telangana.*
*తెలంగాణ లో ములుగు కేంద్రముగా కంపించిన భూకంపం*
*ముఖ్య స్తానం నుండి 225 కిలోమీటర్ల వరకు కనిపించిన ప్రభావం..*
హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మణుగురు, హన్మకొండ, విజయవాడలో భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. కొన్నిచోట్ల 2 సెకండ్లపాటూ ప్రకంపనలు రాగా.. కొన్నిచోట్ల 4 సెకండ్లపాటూ భూమి కంపించినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూ-ప్రకంపనలు వచ్చాయి.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఉదయం 7.27 గంటలకు ఈ భూకంపం వచ్చింది.
ములుగులో భూకంప కేంద్రం?
ఒక అంచనా ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప కేంద్రం ములుగు జిల్లాలో.. భూమికి 35 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు EMSC చెబుతోంది. ఈ భూకంపం రాత్రి 1.57కి వచ్చినట్లు చెబుతోంది. ఐతే.. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఉదయం 7 నుంచి 7.30 మధ్యలో భూకంపం వచ్చింది అంటున్నారు.
*బిగ్ బ్రేకింగ్*
*మేడారం కేంద్రంగా భూకంపం..!*
*సమ్మక్క, సారాలమ్మ తల్లి అగ్రహించిందా...?*
ములుగు జిల్లా: మేడారం కేంద్రంగా రెండు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. మేడారం పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4 న 50వేల చెట్లు ఎక్కడ పడ్డాయో..... అక్కడే మొదలయిందని అధికారులు వెల్లడించారు.
Comments
Post a Comment