పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



 పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


*సనత్ నగర్ (ఎర్రగడ్డ)*


*పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*


* ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం కృషి చేస్తుంది.


* యేడాది కాలంలో దాదాపు 1500 కోట్ల ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ లకు చెల్లించాం.


* ఆరోగ్యశ్రీని పటిష్ట పరిచి పది లక్షలకు పెంచాం


* పేదవారు కార్పోరేట్లకు పోయి చికిత్స తీసుకొని అప్పులపాలు కాకుండా ఉండేల టిమ్స్ ల నిర్మాణం


* మాది స్కీంల ప్రభుత్వం – బీఆర్ఎస్ స్కాంల పార్టీ


* మా టాప్ ప్రయార్టీ పేద ప్రజల సంక్షేమమే


* *సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ నిర్మాణ పనుల పరిశీనానంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు*


      పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సనత్ నగర్ (ఎర్రగడ్డ)లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజున గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించేందుకు శరవేగంగా పనులు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి.. పేద ప్రజలు రూపాయి లేకున్నా కార్పోరేట్ ను మించిన వైద్యం అందుకునేలా టిమ్స్ ఆసుపత్రిని మలుస్తామని చెప్పారు.


    మేం స్కీంలను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతుంటే – బీఆర్ఎస్ పార్టీ స్కాంలు చేస్తూ ప్రజల్లో అబాసుపాలవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. విదేశాల్లో నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం అందించినట్టే తెలంగాణలోనూ అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు మంత్రి తెలిపారు.


      సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ హాస్పిటల్ నిర్మాణంలో ఆర్ & బీ, వైద్యశాఖ సమన్వయం చేసుకునేలా నోడల్ ఆఫీసర్ ను నియమిస్తామని. వచ్చే రెండు మూడు రోజుల్లో రెండు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యచరణపై రూట్ మ్యాప్ ను రూపొందిస్తామని వివరించారు. హాస్పిటల్ నిర్మాణం చేయడం అంటే సొంతిళ్లు నిర్మించుకున్నట్టేనని అయన అన్నారు... దేశవ్యాప్తంగా ఎన్నో కట్టడాలను కడుతున్న మెఘా సంస్థ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని ఒక దైవకార్యంల భావించాలని మెఘా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బందికి మంత్రి సూచించారు.


     ఇక ఎలక్ట్రిసిటీ సిస్టమ్, ఆక్సిజన్ పైపింగ్ సిస్టమ్, వాటర్ అండ్ డ్రైనేజీ సిస్టమ్స్ ఎక్కడా లోపాలు లేకుండా నిర్మించాలని అధికారులకి సూచించిన మంత్రి.. ఒక్కసారి పేషెంట్లు జాయిన్ అయ్యాక లీకేజీలు వస్తే నిర్మించిన సంస్థ రెప్యూటేషన్ దెబ్బతింటుందని నిర్మాణ సంస్థను హెచ్చరించారు.


     హాస్పిటల్ లో పేషెంట్ల ప్రాణాలను నిలబెట్టే ప్రధానమైన ఎమర్జెన్సీ పికప్, డ్రాప్ పాయింట్స్ మరింత విశాలంగా ఉండేలా నిర్మించాలని అధికారులకు మంత్రి సూచించారు.  ఎమర్జెన్సీ వార్డులో పెషెంట్లు వెయిటింగ్ లేకుండా ఉండేలా అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన మంత్రి.. గొల్డెన్ అవర్ లో పేషెంట్ కు తగిన చికిత్స అందితే ప్రాణాలు రక్షించినట్టే తెలిపారు. రెండు మూడు రోజుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు, వైద్య పరికరాల కూర్పుపై వైద్యశాఖ అధికారులతో ఆర్ అండ్ బీ ఇంజనీర్ల సమావేశమవుతారని తెలిపిన మంత్రి.. బ్లాక్-ఏ ఇప్పటికే స్లాబ్ వర్క్ పూర్తయ్యిందని టైలింగ్, సీలింగ్, ప్లాస్టరింగ్ వర్కులు నడుస్తున్నాయని.. బ్లాక్ – బీ 5వ అంతస్తూ స్లాబ్ పడితే పూర్తవుతుంది, బ్లాక్ – సీ పనులు చివరి దశలో ఉన్నట్టు తెలిపారు. హాస్పిటల్ వచ్చే రోగుల్లో మానసిక ఆనందాన్ని కలిగించేందుకు పచ్చని గ్రాస్ గార్డెన్ తో పాటు రంగు రంగుల పూల మొక్కలు నాటాలని సూచించారు. పేషేంట్ల అటెండెంట్లు ఉండేందుకు అధునాతన సౌకర్యాలతో ధర్మశాల నిర్మించడంతో పాటు.. అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం చేసుకున్నామని. వారికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అధునాతన హాస్టల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఫార్మసీ రూం, ఓపీడీ రిజిస్ట్రేషన్ రూంలను కంప్యూటరించి పేషెంట్లకు వేగంగా అయిపాయింట్లు మెంట్లు దొరికేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రేడియోలజీ, ఎమర్జెన్సీ వార్డులు, ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ రూంలను పేషెంట్లకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

 

   ఇదే కాకుండా, అల్వాల్ టిమ్స్ కు స్థల ఇబ్బందులు ఉంటే ఎన్ఓసీ ఇప్పించానని తెలిపిన మంత్రి.. ఎల్.బీ నగర్ టిమ్స్ నిర్మాణాన్ని వేగవతం చేస్తామని వివరించారు. ఇక వచ్చే రెండు, మూడు నెలల్లో గోషామహల్ స్టేడియంలో ఉస్మానియ నయా దవాఖాన నిర్మాణం చేపడుతున్నామని, నిమ్స్ దవాఖాన ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేలా  పనులను స్పీడప్ చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.


      ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఎలక్రిసిటీ విభాగం సీఈ లింగారెడ్డి తో పాటు ఎస్ఈ విశ్వకుమార్ ఈఈలు, మెఘా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్