మాత శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి


 


           మాత శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.

Nalgonda,:

       బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ ప్రసవం  సమయంలో, అలాగే ప్రసవానంతరం మాతృ మరణాలు,శిశు మరణాల వంటివి సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ తోపాటు, సంబంధిత శాఖల పై ఉందని అన్నారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వంటి కారణాల  వల్ల ఏ తల్లి బాధపడకూడదని చెప్పారు.  మాత ,శిశు మరణాలు సంభవించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.  మహిళ  గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు, అలాగే ప్రసవానంతరం కూడా పూర్తిగా  వైద్య ఆరోగ్యశాఖ,ఐ సి డి ఎస్ కనుసన్నల్లో ఉండేలా  నెలనెలా పరీక్షలు,ఇమునైజెషన్ , పౌష్టికాహారం వంటివి అందించాలని ,నిర్ధారిత సమయానికి ప్రసవం జరిగేలా చూడాలని, ప్రసవం సందర్భంగా ఎలాంటి జబ్బులకు గురికాకుండా తల్లిని అలాగే ప్రసవించిన తర్వాత బిడ్డను క్షేమంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.


      జిల్లాలో వైద్యుల  ప్రెస్క్రిప్షన్ లేకుండానే కొన్ని  మెడికల్ షాపులు, ఆసుపత్రులలో అబార్షన్ కిట్ల అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వైద్యుల అనుమతి లేకుండా అబార్షన్ కిట్లు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.


      మనుషుల ప్రాణాలు కాపాడటమే వైద్యులు విధిగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంది వైద్యులు సేవలందించాలని అన్నారు. ముఖ్యంగా  మాతా,శిశు మరణాలను నివారించే విషయంలో ఇకపై ఏరియా ఆసుపత్రుల వారిగా, డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తానని ఆమె తెలిపారు. ప్రసవ సమయంలో, ప్రసవానంతరం తల్లిదండ్రులు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలవల్ల శిశు మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా వ్యాప్తంగా పుట్టిన శిశువుకి పాలివ్వడం, అదేవిధంగా జాగ్రత్తలు తీసుకునే విషయంపై అవగాహన కల్పించేందుకు లాక్టషన్  (చనుబాలివ్వడం) పై కౌన్సిలర్లను నియమించాలని ఆమె ఆదేశించారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్, అబార్షన్ వంటి వాటి పట్ల పట్టణ స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించేందుకు  వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న మూడు వారాలు మూడు డివిజన్లో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి  మాత శిశు సంరక్షణపై  సమీక్ష నిర్వహిస్తామని, ఈ సమావేశానికి  సంబంధిత వైద్యాధికారులతోపాటు, సిడిపిఓ, జిల్లా సంక్షేమ అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఎస్ ఎన్ సి యు, ఐ సి యు లలో సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని , అలాగే  సీసీటీవీ ల ఏర్పాటు విషయమై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


      జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి ,జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్  అరుణకుమారి  సంబంధిత ఆస్పత్రుల వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాలు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్