కిమ్స్ హాస్పిటల్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 

• ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


• శ్రీతేజ్ చెయ్యి పట్టుకొని పిలిచి భావోద్వేగానికి లోనైన మంత్రి..


• శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడి బాబు యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి


• ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల చెక్కును అందించిన మంత్రి..


• ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భాస్కర్ కు మంత్రి అభయం..


• భాస్కర్ భార్య రేవతి తన కాలేయాన్ని భర్తకు ఇచ్చి ప్రాణదానం చేసి.. తాను తనువు చాలించడం బాధకరమని తెలిపిన మంత్రి


• యేడాది క్రితమే భర్త భాస్కర్ కు కాలేయం దానం చేసిన రేవతి


• కాలేయ మార్పిడి ఖర్చులను సియంఆర్ఎఫ్ క్రింద ఇప్పించేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి


• భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి


• తండ్రిగా ఇద్దరు పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీమీద ఉంది.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ భాస్కర్ కు జాగ్రత్తలు చెప్పిన మంత్రి

• అధైర్యపడొద్దు.. ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మంత్రి


• సినిమాల వల్ల ప్రజలు సంతోషపడాలి కానీ ప్రాణాలు పోవడం బాధకరమన్న మంత్రి


• శ్రీతేజ్ అవయవాల పనితీరు, కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందని డాక్టర్లను ఆరాతీసిన మంత్రి


• అవసరం అనుకుంటే అమెరికా నుంచైన మంచి మందులు తెప్పించండి, డాక్టర్లను పిలిపించండని సలహా ఇచ్చిన మంత్రి


• శ్రీతేజ్ చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది.. ఒక్క రూపాయి కూడా భాస్కర్ ను అడగొద్దని కిమ్స్ యాజమాన్యానికి సూచించిన మంత్రి


• మందులు, చికిత్స, ఇతర అవసరాలు ఏదున్న ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన మంత్రి

*అనంతరం మీడియాతో మాట్లాడుతూ..*


ఇక పై తెలంగాణలో నో బెన్ ఫిట్ షోస్


దేశ భక్తి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమాలు, మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే బెన్ ఫిట్ షో గురించి ఆలోచిస్తాం.

పుష్ప 2 నేను కూడా చూశాను

మూడు గంటల సినిమా చూసే సమయంలో చాలా పనులు చేసుకోవచ్చు 


సినిమాలతో యువత చెడిపోతుందనే భావన సమాజంలో ఉంది.


ఇకపై తెలంగాణలో నో బెన్ఫిట్ షో, నథింగ్ 


సినిమా హీరోలు బాధ్యతతో మెలగాలి, నిబంధనల ప్రకారం నడుచుకోవాలి 


పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లొద్దు.. దాని వల్ల సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.


సినిమా ప్రమోషన్ చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దు.. మరోసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తగా మెలగాలి.


సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం, పరిశ్రమగా గౌరవిస్తాం.. అంతేకానీ దురుసు చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించం


అందరూ హీరోలు, ప్రొడ్యూసర్స్ కోఆపరేట్ చేయాలి

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్