విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక






విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక 


హైదరాబాద్, డిసెంబర్ 25: ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక నిన్న హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో అతి ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెళ్లీడు ఉన్న ఆర్యవైశ్య అమ్మాయిలు మరియు అబ్బాయిలు సుమారు 110 మంది పాల్గొని పరస్పర పరిచయాలు చేసుకున్నారు. వాతావరణం సంపూర్ణంగా పెళ్లి వేడుకగా మారింది.


ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేదిక రాత్రి 8 గంటల వరకు కొనసాగింది.


ముఖ్య అతిథులుగా రమేష్ గెల్లి గ మరియు తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత హాజరై తమ స్ఫూర్తిదాయకమైన మాటలతో కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించారు.


రమేష్ గెల్లి మాట్లాడుతూ, జీవిత భాగస్వామి ఎంపికలో ఓపిక, సర్దుకుపోయే గుణం ముఖ్యమని హితవు పలికారు. శ్రీమతి కల్వ సుజాత ఈ సందర్భంలో మాట్లాడుతూ, భాగస్వామి ఎంపిక ఈ రోజుల్లో ఎంత కష్టమైనదో వివరించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆవోపా నిర్వాహకుల శ్రమను ప్రశంసించారు.


సభాధ్యక్షులు నమశివాయ స్వాగత ఉపన్యాసంలో ఈ సంవత్సరంలో కొత్తగా ఒక మధ్యస్థ కమిటీను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీకి ఈ పరిచయ వేదిక సలహాదారులు కౌటికె విఠల్ చైర్మన్‌గా నియమించబడగా, ఐదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉండబోతున్నారు. ఈ కమిటీ ద్వారా సంబంధాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం తమ కర్తవ్యమని వివరించారు.


ప్రధాన కార్యదర్శి మడుపల్లి రవి గుప్తా మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్ల అనుభవంతో భవిష్యత్తులో ప్రతి సంవత్సరం 25 డిసెంబర్ రోజున ఇదే కార్యక్రమం నిర్వహించబోతున్నామని చెప్పారు. ఉభయ రాష్ట్రాల వైశ్యులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.


మధ్యస్థ కమిటీ చైర్మన్ కౌటికె విఠల్ తమ సభ్యులను పరిచయం చేస్తూ, వారి సేవల ద్వారా సంబంధాలను సమన్వయం చేసేందుకు అందరి సహకారం కోరారు. ఈ సేవకు అవకాశం కల్పించిన ఆవోపా మేనేజ్మెంట్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమం నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన బి.వి. మోహన్ రావు, విశిష్ట జువెలరీస్ గందె సుధాకర్, ఎర్రం బాలకృష్ణ, బండారు సుబ్బారావు, తాడేపల్లి రాజశేఖర్ (చెన్నై), పబ్బతి వెంకట రవికుమార్ గార్లకు సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.


కోషాధ్యక్షులు మాకం బద్రీనాథ్  వందన సమర్పణ ద్వారా కార్యక్రమానికి ముగింపు పలికారు.


 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్